BigTV English

Teflon Flu: నాన్-స్టిక్ పాన్ వాడుతున్నారా..? ఆ భయంకరమైన వ్యాధి రావచ్చు జాగ్రత్త..!

Teflon Flu: నాన్-స్టిక్ పాన్ వాడుతున్నారా..? ఆ భయంకరమైన వ్యాధి రావచ్చు జాగ్రత్త..!

Teflon Flu: వంట చేయడానికి దాదాపు అందరూ నాన్-స్టిక్ పాన్‌లనే వాడతారు. దీన్ని వాడడం వల్ల నూనె చాలా తక్కువగా పీల్చుకుంటుందట. ఆహారం పాత్రలకు అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా జిడ్డు, ఆహార దీని అంటుకోవు కాబట్టి దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే చాలా మంది నాన్-స్టిక్ పాన్‌ను వాడేందుకు ఇష్టపడతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, వీటిని అతిగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయాన్ని మాత్రం ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ సరిగా పట్టించుకోరు. నాన్-స్టిక్ పాన్‌లలో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల భయంకరమైన వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


నాన్-స్టిక్ పాన్‌ల నుంచి విషపూరితమైన పొగలు వస్తాయట. దీని వల్ల టెఫ్లాన్ ఫ్లూ అనే వ్యాధి వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.కార్బన్, ఫ్లోరిన్ ఉండే సింథటిక్ కెమికల్‌తో ఈ పాన్‌ను తయారు చేస్తారట. దీన్ని పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ అని పిలుస్తారు. అయితే ఈ పాన్‌ను వేడి చేయడం వల్ల గాలిలో విషపూరితమైప పొగలు విడుదలవుతాయట. దీన్ని పీల్చడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రకమైన కెమికల్స్ విడుదల కాకుండా ఉండాలంటే పాన్‌ను 450 నుంచి 500° డిగ్రీల కన్నా తక్కువ వేడి చేయాలట. ఒకవేళ విపరీతమైన వేడి తాకితే పాన్ నుంచి వచ్చే విషపూరితమైన గాలులు ఊపిరితిత్తులలోకి వేళ్లే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందట.


సైడ్ ఎఫెక్ట్స్..
ఈ విషపూరితమైన గాలులు పీలిస్తే తల నొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, చలి, వణుకు ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు పల్మనరీ ఎడెమా కూడా వచ్చే ప్రమాదం ఉందట. సకాలంలో దీనికి చికిత్స చేయకపోతే, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందట.

ఇలా చేస్తే సేఫ్..
కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మట్టి పాత్ర లేదా ఐరన్ పాన్‌ వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు నాన్-స్టిక్ పాన్‌లలో బేకింగ్ చేయకపోవడమే మంచిది. వీటిలో వంట చేయాల్సి వస్తే వంట గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల నాన్-స్టిక్ పాన్‌ల నుంచి వచ్చే పొగలు బయటకు వెళ్లిపోతాయట.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×