Lemon fish recipe: సీఫుడ్ లవర్స్‌కు ఫిష్ అంటే ..ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కానీ, ఎప్పుడూ ఒకే లాంటి కారం, మసాలా ఫిష్ ఫ్రై తిని బోర్ కొడితే.. ఈసారి కాస్త డిఫరెంట్‌గా, ట్రెండీగా లెమన్ ఫిష్ ట్రై చేయండి! నిమ్మ కాయ పులుపు, వెల్లుల్లి ఘాటు, లేత మసాలాల.. కాంబినేషన్‌లో ఈ డిష్ రుచి అద్భుతంగా ఉంటుంది. డైట్ చేసే వారికి.. హెల్తీగా తినాలనుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఎంతో ఈజీగా, తక్కువ సమయంలోనే.. ఇంట్లో లెమన్ ఫిష్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
మన డైట్‌లో చేపలను చేర్చుకోవడం వల్ల ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. సాధారణంగా మన వంటల్లో.. కారం, గరం మసాలాలు ఎక్కువగా వాడుతుంటాం. కానీ, లెమన్ ఫిష్ రెసిపీలో చేప అసలు రుచి చెడిపోకుండా, నిమ్మకాయ, హెర్బ్స్ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. బోన్‌లెస్ ఫిష్ ఫిల్లెట్స్ లేదా ముక్కలతో దీన్ని చేస్తే తినడానికి కూడా రుచిగా ఉంటుంది.
చేప ముక్కలు లేదా ఫిల్లెట్స్ – 500 గ్రాములు
తాజా నిమ్మరసం – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – 8 నుంచి 10
నల్ల మిరియాల పొడి –1 టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
ఆలివ్ ఆయిల్ లేదా బటర్ / కుకింగ్ ఆయిల్ – 2టేబుల్ స్పూన్లు
కొత్తిమీర లేదా పార్స్లీ / మిక్స్‌డ్ హెర్బ్స్ – కొద్దిగా
పచ్చిమిర్చి లేదా చిల్లీ ఫ్లేక్స్ – కొద్దిగా
1.ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలపై నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి ముక్కలు.. వేసి సున్నితంగా కలపండి. చేప ముక్కలు విరిగిపోకుండా.. జాగ్రత్తగా మసాలా పట్టించి, కనీసం 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టండి. నిమ్మరసం చేపలోని.. నీచు వాసనను తగ్గించి, ముక్కలను సాఫ్ట్‌గా చేస్తుంది.
2. వెడల్పుగా ఉండే నాన్-స్టిక్ పాన్‌లో ఆలివ్ ఆయిల్ లేదా బటర్ వేసి మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయండి. బటర్ వాడితే.. మాడిపోకుండా కొద్దిగా నూనె కలపడం మంచిది.
3. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయే.. వరకు కొద్దిసేపు వేపండి. వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా.. పాన్‌లో పేర్చండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక్కో వైపు 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే వేపండి. చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. ఎక్కువసేపు వేపితే ..డ్రైగా మారే అవకాశం ఉంటుంది. ఒక వైపు బంగారు రంగులోకి మారాక, జాగ్రత్తగా రెండో వైపు తిప్పి వేపండి.
4. చివరగా మిగిలిన కొద్దిపాటి నిమ్మరసం, తాజా కొత్తిమీర లేదా హెర్బ్స్ చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
ఈ లెమన్ ఫిష్‌ను వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మచెక్కలు, సలాడ్ లేదా గార్లిక్ బ్రెడ్‌తో సర్వ్ చేస్తే కేఫ్ స్టైల్ ఫీల్ వస్తుంది.
మసాలా తక్కువగా ఉండే ఈ రెసిపీ పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది.
చేప ముక్కలను తిప్పేటప్పుడు ఫ్లాట్ స్పాచులా వాడితే ముక్కలు చెక్కుచెదరకుండా చక్కగా వస్తాయి.