E-Paper
Advertisement

బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!

బంగాళదుంప వేపుడు కరకరలాడుతూ రావాలా? ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వండి!
Advertisement

Crispy potato fry: బంగాళదుంప వేపుడు.. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఫేవరెట్. పప్పుచారు, సాంబార్ లేదా రసం అన్నంలోకి.. కరకరలాడే ఆలు ఫ్రై పడితే.. ఆ మజాయే వేరు. కానీ, చాలా మందికి ఫ్రై చేసేటప్పుడు దుంపలు విరిగి పోవడం, ముద్దగా అవ్వడం లేదా రంగు మారడం వంటి సమస్యలు ఎదురవు తుంటాయి. అసలు ఆలు వేపుడు క్రిస్పీగా, బంగారు రంగులో, అద్భుతమైన రుచితో.. రావాలంటే ఏం చేయాలి? వంట గదిలో పాటించాల్సిన వివరంగా తెలుసుకుందాం.

మన కిచెన్ లో.. ఎప్పుడూ అందుబాటులో ఉండే ..బంగాళదుంపతో.. ఎన్ని రకాల వంటకాలైనా చేయొచ్చు. వాటిలో.. ఆలు వేపుడు ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉండే.. క్లాసిక్ డిష్. అయితే.. దుంప ముక్కలు విడిపోకుండా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా రావాలంటే.. కొన్ని చిన్నపాటి టెక్నిక్స్ పాటించడం చాలా అవసరం.

Advertisement

కరకరలాడే ఆలు వేపుడు కోసం పాటించాల్సిన 6 స్మార్ట్ టిప్స్:

1.మార్కెట్లో.. తీసుకునే బంగాళదుంపలు గట్టిగా, తాజాగా ఉండేలా చూసుకోండి. మరీ లేతగా.. లేదా నీటి శాతం ఎక్కువగా ఉండే దుంపలు వాడితే ..వేపుడు ముద్దగా మారే అవకాశం ఉంటుంది.

Advertisement

2.బంగాళదుంపలను తరిగిన వెంటనే నీళ్లలో కడుగుతాం కదా. ఆ తర్వాత వాటిని..ఒక కాటన్ క్లాత్ లేదా టిష్యూ పేపర్‌పై వేసి తడి పూర్తిగా పోయేలా.. ఆర బెట్టండి. తడి ఉంటే.. నూనెలో.. వేసినప్పుడు దుంపలు వేగకుండా.. ఆవిరి వల్ల మెత్తబడతాయి. (అవసరమైతే కొద్దిగా స్టార్చ్ పోయేలా కడిగి బాగా తుడవండి).

3.వెడల్పుగా.. ఉండే నాన్-స్టిక్ లేదా మంద పాటి పాన్ వాడటం మంచిది. నూనె సరిగ్గా వేడెక్కిన తర్వాతే.. దుంప ముక్కలు వేయాలి. ముక్కలు వేసిన వెంటనే..గరిటెతో పదే పదే తిప్పకుండా.. ఒక వైపు కొద్దిగా వేగ నిచ్చి ఆ తర్వాత నిదానంగా కలపాలి. అప్పుడే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి.

4. హై ఫ్లేమ్‌లో.. వేపితే బయట రంగు మారినా.. లోపల సరిగ్గా ఉడకదు. అందుకే .. మీడియం ఫ్లేమ్‌లో వేపుతూ, మధ్యమధ్యలో ఫ్లేమ్‌ను అడ్జస్ట్ చేస్తూ నిదానంగా వేపితే ..బంగారు రంగు, కరకరలాడే టెక్స్చర్ వస్తుంది.

5. దుంపలు సగం కంటే ..ఎక్కువగా వేగిన తర్వాత మాత్రమే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వెల్లుల్లి దంచి వేయండి. ముందే ఉప్పు వేస్తే.. దుంపల్లోని నీరు బయటకు వచ్చి వేపుడు మెత్తబడుతుంది.

Also Read: నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టంట్ రాగి అట్టు..ఇలా చేస్తే అదిరిపోయే రుచి 

6. చివరగా .. తాజా కరి వేపాకు, కొద్దిగా జీల కర్ర పొడి లేదా ధనియాల పొడి చల్లి ఒక నిమిషం కలిపితే.. వేపుడు రుచి నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంది.

చిట్కాలు:

తక్కువ నూనెతో.. హెల్తీగా, క్రిస్పీగా.. ఆలు ఫ్రై కావాలనుకుంటే.. కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి.. ఎయిర్ ఫ్రయర్‌లో కూడా ట్రై చేయొచ్చు.

అన్ని ముక్కలను సమాన సైజులో.. కట్ చేస్తే.. అన్నీ ఒకే సారి సమానంగా వేగుతాయి.

ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. ప్రతిసారి మీ బంగాళదుంప వేపుడు.. కరకరలాడుతూ, కంటికి ఇంపైన రంగులో.. నోరూరించే రుచితో పర్ఫెక్ట్‌గా వస్తుంది.

Related News

అచ్చం 5 స్టార్ హోటల్ రుచి.. చాలా సింపుల్‌గా ముర్గ్ మలై కోఫ్తా!

ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్పెషల్ ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ చేసి పెట్టండి.. ఫిదా అయిపోతారు!

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా?ఈ తప్పులు చేస్తే ప్రమాదమే..జాగ్రత్త!

మీ గ్యాస్ సిలిండర్ నెల కూడా రావడం లేదా? కారణాలివే కావొచ్చు!

వాటర్ ట్యాంక్‌లోని.. నీరు ఎన్ని రోజుల వరకూ తాగొచ్చు?

ఏడాదిలో ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చే శ్రీవారి రూపం.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ రెండు సింపుల్ ఫుడ్స్ తినండి చాలు

Big Stories

Advertisement
×