Overhead water tank cleaning tips: రోజువారీ అవసరాలకు, కొన్ని సందర్భాల్లో.. తాగడానికి కూడా మనం ఇంటి పైకప్పు మీద లేదా భూగర్భంలో ఉండే వాటర్ ట్యాంక్‌లపై ఆధారపడతాం. కానీ.. ట్యాంక్‌లో నీరు ఎంతకాలం పాటు సురక్షితంగా ఉంటుంది? ఎప్పుడు క్లీన్ చేస్తే ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది? ట్యాంక్‌ను శుభ్రం చేయకుండా.. వది లేస్తే బ్యాక్టీరియా, పాచి చేరి నీరు కలుషితమయ్యే ప్రమాదం.. ఉంది. నీటి నిల్వ సమయం, క్లీనింగ్ షెడ్యూల్ ,ఆరోగ్యకరమైన నీటి కోసం పాటించాల్సిన స్మార్ట్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఆరోగ్యం మనం తాగే, వాడే నీటి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చాలా ఇళ్లలో.. మున్సిపల్ లేదా బోర్‌వెల్ నీటిని ట్యాంక్‌లలో.. నిల్వ చేస్తారు. అయితే..నిల్వ చేసిన నీరు ఎల్లప్పుడూ తాజాగా, తాగడానికి సురక్షితంగా ఉండదు.
సాధారణంగా శుభ్రమైన, మూత సరిగ్గా.. ఉన్న ట్యాంక్‌లో నిల్వ చేసిన నీరు కొన్ని రోజుల నుంచి గరిష్టంగా 1 నుంచి 2 వారాల వరకు మాత్రమే వాడకానికి అనుకూలంగా ఉంటుంది.
తాగునీటి విషయం: ట్యాంక్ నీటిని నేరుగా తాగడం కంటే, RO లేదా ఇతర వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా శుద్ధి చేసి లేదా కాచి చల్లార్చి తాగడం ఎప్పుడూ సేఫ్.
నీరు ఎప్పుడు పాడవుతుంది? వాతావరణంలోని.. వేడి, సూర్య రశ్మి, ట్యాంక్ మూత సరిగ్గా లేక పోవడం, లేదా నీటిలో ..ఆక్సిజన్ తగ్గి పోవడం వల్ల కొన్ని రోజుల్లోనే.. ఆల్గే (పాచి), బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. వర్షాకాలంలో.. లేదా వేసవిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీటి నాణ్యత మరింత త్వరగా మారే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య నిపుణులు, నిర్వహణ ప్రమాణాల ప్రకారం.. ఇంటి వాటర్ ట్యాంక్‌ను ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒక సారి తప్పని సరిగా శుభ్రం చేయాలి.
వేసవికి ముందు & వర్షాకాలం ముందు: ముఖ్యంగా.. వేసవి ప్రారంభంలో, వర్షాకాలం మొదలు కాక ముందు ట్యాంక్ క్లీనింగ్ చేయడం.. చాలా మంచిది.
నీటి రంగు లేదా వాసన మారితే: ట్యాంక్ నీటిలో రంగు మారడం, దుర్వాసన రావడం.. లేదా బురద లాంటి అవక్షేపాలు కనిపిస్తే వెంటనే క్లీన్ చేయాలి.
ట్యాంక్ మూత ఎప్పుడూ.. టైట్‌గా ఉంచండి: గాలి ద్వారా దుమ్ము, ఆకులు, కీటకాలు లేదా పక్షుల వ్యర్థాలు ట్యాంక్‌లో.. పడకుండా మూతను ఎప్పుడూ గట్టిగా మూసి ఉంచాలి.
ఎయిర్ వెంట్‌కు మెష్ (జాలీ): ట్యాంక్ ఎయిర్ వెంట్ పైపుకు చిన్న జాలీ అమర్చడం వల్ల దోమలు, చిన్న పురుగులు లోపలికి.. వెళ్లకుండా ఉంటాయి.
ఫుడ్-గ్రేడ్ ట్యాంక్‌లు: కొత్త ట్యాంక్ కొనేటప్పుడు UV స్టెబిలైజ్డ్, ఫుడ్-గ్రేడ్ మెటీరియల్‌తో.. చేసిన ట్యాంక్‌లను ఎంచుకోవడం వల్ల ఎండ వేడికి ప్లాస్టిక్ రసాయనాలు నీటిలో కలవకుండా ఉంటాయి.
Also Read: లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!
ప్రొఫెషనల్ క్లీనింగ్: ట్యాంక్ లోపల ..దిగి సొంతంగా క్లీన్ చేసేటప్పుడు గాలి అందకపోవడం వంటి ప్రమాదాలు జరగొచ్చు. అందుకే.. వాక్యూమ్ క్లీనింగ్, శానిటైజేషన్ చేసే ప్రొఫెషనల్.. సర్వీస్‌లను ఉపయోగించడం లేదా సురక్షిత పద్ధతులు పాటించడం బెస్ట్.
ప్యూరిఫికేషన్ తప్పని సరి: ట్యాంక్ ఎంత శుభ్రంగా.. ఉన్నా, తాగే నీటి కోసం నమ్మకమైన ప్యూరిఫికేషన్ వ్యవస్థను.. వాడటం ద్వారా నీటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.
నిల్వ నీటి విషయంలో.. నిర్లక్ష్యం వహించకుండా, సరైన సమయంలో.. ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ, నీటిని సురక్షితంగా శుద్ధి చేసుకుని.. వాడటమే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కి అసలైన మార్గం.