LPG gas saving tips: ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం, మళ్లీ డబ్బులు కట్టడం అంటే.. జేబుకు చిల్లు పడినట్టే కదా! ఇంట్లో.. వంట ఎక్కువగా ఉన్నప్పుడో, లేదా కొన్ని చిన్నచిన్న అలవాట్ల వల్లనో సిలిండర్ నెల కూడా.. రాకముందే ఖాళీ అవుతుంటుంది. అసలు ఎల్పీజీ గ్యాస్.. ఎక్కువ కాలం రావాలంటే.. ఏం చేయాలి? కిచెన్‌లో మనం చేసే.. ఏ తప్పుల వల్ల గ్యాస్ వృథా అవుతోంది? సిలిండర్ ధరల వివరాలతో.. పాటు, గ్యాస్ ఆదా చేసే.. చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌లో ఎల్పీజీ సిలిండర్ ఖర్చు చాలా కీలకం. వంట గదిలో చిన్నపాటి మార్పులు, జాగ్రత్తలు తీసుకుంటే ఒక సిలిండర్‌ను అదనంగా మరో వారం నుంచి పది రోజుల వరకు ఈజీగా వాడుకోవచ్చు.
బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి: స్టవ్ బర్నర్ రంధ్రాలలో నూనె, ఆహారపు తుంపర్లు, దుమ్ము పేరుకుపోతే.. మంట సరిగ్గా రాదు. నీలి రంగు మంటకు బదులు ఎరుపు లేదా నారింజ రంగు మంట వస్తుంటే.. గ్యాస్ వృథా అవుతున్నట్లే. బర్నర్లను వేడి నీరు, నిమ్మరసం లేదా సోడాతో శుభ్రం చేస్తే.. మంట సమానంగా, నీలి రంగులో వచ్చి గ్యాస్ ఆదా అవుతుంది.
పాత్రల అడుగు భాగం పొడిగా ఉండేలా చూడండి: కడిగిన వెంటనే.. తడిగా ఉన్న పాత్రలను నేరుగా స్టవ్ మీద పెట్టకండి. ఆ తడి ఆరడానికి ముందుగా గ్యాస్ శక్తి వృథా అవుతుంది. పాత్రను తుడిచి.. లేదా కొద్దిసేపు ఆర బెట్టి స్టవ్ మీద పెట్టడం మంచిది.
మూత పెట్టి ఉడికించండి : కూరలు, అన్నం, నీళ్లు వేడి చేసేటప్పుడు పాత్రపై.. మూత పెట్టడం వల్ల వేడి త్వరగా.. లోపల నిలిచి, తక్కువ సమయంలోనే.. వంట పూర్తవుతుంది. దీని వల్ల గ్యాస్ వాడకం గణనీయంగా తగ్గుతుంది.
Also Read: లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!
ప్రెషర్ కుక్కర్ వాడకం పెంచండి: పప్పులు, మాంసం, బియ్యం వంటివి సాధారణ పాత్రలలో.. ఉడికించడం కంటే.. ప్రెషర్ కుక్కర్‌లో వండితే సమయం, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి.
ఫ్రిజ్ నుంచి తీసిన వస్తువులను రూమ్ టెంపరేచర్‌కు రానివ్వండి: ఫ్రిజ్‌లో పెట్టిన పాలు, కూరగాయలు లేదా పిండిని వెంటనే స్టవ్ మీద వేడి చేస్తే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. వాటిని 15–20 నిమిషాలు బయట ఉంచి, ఆ తర్వాత వేడి చేయడం స్మార్ట్ ట్రిక్.
సిమ్‌లో ఉంచడం & ముందుగానే స్టవ్ ఆఫ్ చేయడం: నీళ్లు మరగడం, కూర ఉడకడం పూర్తయ్యే.. దశకు రాగానే స్టవ్ ఆఫ్ చేస్తే, ఆ పాత్రలో ఉండే మిగిలిన వేడితోనే.. వంట పూర్తిగా ఉడికిపోతుంది. అలాగే.. పాత్ర కంటే పెద్ద మంట పెడితే ..వేడి చుట్టూ పోయి గ్యాస్ వృథా అవుతుంది.
చివరగా.. గ్యాస్ పైపులో లీకేజీలు లేకుండా తరచూ చెక్ చేయడం, రెగ్యులేటర్‌ను రాత్రి పూట ఆఫ్ చేయడం వల్ల సేఫ్టీ పాటు గ్యాస్ కూడా ..ఆదా అవుతుంది. ఈ చిన్న అలవాట్లతో మీ సిలిండర్ లైఫ్‌ను ఈజీగా పెంచుకోండి!