E-Paper
Advertisement

ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్పెషల్ ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ చేసి పెట్టండి.. ఫిదా అయిపోతారు!

ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ స్పెషల్ ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ చేసి పెట్టండి.. ఫిదా అయిపోతారు!
Advertisement

Bang Bang Chicken: చికెన్ ప్రియులకు కొత్త రకం వంటకాలను రుచి చూడటం అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే చికెన్ ఫ్రై, చిల్లీ చికెన్ కాకుండా ఈసారి కాస్త భిన్నంగా ‘బ్యాంగ్ బ్యాంగ్ చికెన్’ ప్రయత్నించి చూడండి. పేరు వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా.. దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటూ.. తీపి, కారం కలగలిసిన క్రీమీ సాస్ కోటింగ్‌తో నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.

ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా లేదా ఇంట్లో వాళ్లంతా ప్రత్యేకంగా ఏదైనా తినాలనిపించినప్పుడైనా ఇది ఒక బెస్ట్ ఆప్షన్. పిల్లలకే కాదు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ స్పెషల్ రెసిపీని ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

బోన్‌లెస్ చికెన్ – పావు కిలో
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్) – అర కప్పు
మైదా పిండి – పావు కప్పు
గుడ్డు – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక చెంచా
మిరియాల పొడి – అర చెంచా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
మయోనైస్ – నాలుగు చెంచాలు
స్వీట్ చిల్లీ సాస్ – రెండు చెంచాలు
టమోటా కెచప్ – ఒక చెంచా
వెల్లుల్లి తరుగు – ఒక చెంచా
సన్నగా తరిగిన ఉల్లికాడలు – కొద్దిగా

Also Read: ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట కొనడం మానేస్తారు.. 15 నిమిషాల్లో ఇంట్లోనే వెజ్ డ్రై మంచూరియా!

తయారీ విధానం:

Advertisement

బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి. ఇప్పుడు మైదా పిండి, మొక్కజొన్న పిండి కూడా వేసి చికెన్ ముక్కలకు పిండి బాగా పట్టేలా కలుపుకుని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఈలోపు మనం అసలైన బ్యాంగ్ బ్యాంగ్ సాస్ సిద్ధం చేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మయోనైస్, స్వీట్ చిల్లీ సాస్, టమోటా కెచప్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ సాస్ రుచికి మరింత ఘాటు కావాలనుకుంటే కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా కలుపుకోవచ్చు.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్ ముక్కలు బంగారు రంగులోకి వచ్చి, క్రిస్పీగా మారే వరకు వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి.

చివరగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాస్ బౌల్‌లో ఈ వేడివేడి క్రిస్పీ చికెన్ ముక్కలను వేసి, సాస్ అంతా ముక్కలకు బాగా పట్టేలా టాస్ చేయాలి. పైన సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్యాంగ్ బ్యాంగ్ చికెన్ సిద్ధమైనట్లే. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే దీని అసలైన రుచి తెలుస్తుంది.

Also Read: ఆదివారం ఇల్లు మొత్తం ఘుమఘుమలాడిపోవాలంటే.. ఈ టేస్టీ కాజు చికెన్ ఫ్రై చేసుకోవాల్సిందే!

Tags

Related News

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా?ఈ తప్పులు చేస్తే ప్రమాదమే..జాగ్రత్త!

మీ గ్యాస్ సిలిండర్ నెల కూడా రావడం లేదా? కారణాలివే కావొచ్చు!

వాటర్ ట్యాంక్‌లోని.. నీరు ఎన్ని రోజుల వరకూ తాగొచ్చు?

ఏడాదిలో ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చే శ్రీవారి రూపం.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ రెండు సింపుల్ ఫుడ్స్ తినండి చాలు

ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట కొనడం మానేస్తారు.. 15 నిమిషాల్లో ఇంట్లోనే వెజ్ డ్రై మంచూరియా!

పిల్లలు ఇష్టంగా తినే పెరి పెరి మసాలా.. తయారీ విధానం ఇదిగో

Big Stories

Advertisement
×