Driving in heavy fog mistakes: చలి కాలం తెల్ల వారుజామున లేదా రాత్రి వేళల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్మేసినప్పుడు ప్రయాణం చేయడం ఒక సవాల్ లాంటిదే. ముందున్న వాహనం సరిగ్గా.. కనిపించని పరిస్థితుల్లో చిన్న అజాగ్రత్త.. కూడా ప్రాణాలకే ముప్పు తెస్తుంది. పొగ మంచులో కారు లేదా బైక్ నడిపేటప్పుడు ..మనం చేసే సాధారణ పొర పాట్లు ఏంటి? ఒక్క సెకను.. ఆలస్యం కూడా ఎందుకు.. ప్రమాదకరంగా మారుతుంది? హైవేలు, నగర రహదారులపై సురక్షితంగా ప్రయాణించడానికి పాటించాల్సిన స్మార్ట్, ట్రెండీ డ్రైవింగ్ టిప్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హై బీమ్ లైట్లు వాడటం: పొగమంచులో.. చాలా మంది దూరం కనిపిస్తుందని.. హై బీమ్ లైట్లు వేస్తారు. కానీ.. పొగ మంచులోని నీటి తుంపర్లపై హై బీమ్ కాంతి తగిలి వెనక్కి పరావర్తనం చెందుతుంది. దీని వల్ల రోడ్డు.. మరింత అస్పష్టంగా కనిపిస్తుంది. ఎల్లప్పుడూ లో.. బీమ్.. లేదా ఫాగ్ లైట్లు మాత్రమే వాడాలి.
అతి వేగం : మంచు తక్కువగా ఉంది.. కదా అని వేగంగా వెళ్లడం పెద్ద తప్పు. పొగ మంచులో ఒక్క సారిగా ఆగి ఉన్న వాహనం లేదా గుంత కనిపిస్తే బ్రేక్ వేయడానికి తగినంత సమయం దొరకదు. వేగాన్ని.. తగ్గించి, నియంత్రణలో ఉంచుకోవాలి.
హజార్డ్ లైట్లు ఆన్ చేసి నడపడం: కొందరు పొగమంచులో.. కారు నడిపేటప్పుడు నాలుగు ఇండికేటర్లు ఆన్ చేసి డ్రైవ్ చేస్తారు. వాహనం రోడ్డు పక్కన ఆపి ఉన్నప్పుడు మాత్రమే.. హజార్డ్ లైట్లు వాడాలి. నడిపేటప్పుడు వీటిని వాడితే.. మీరు లైన్ మారుతున్నారా లేక ఆగుతున్నారా అనే అయోమయం వెనక వాహనదారులకు కలుగుతుంది.
ముందు వాహనానికి దగ్గరగా వెళ్లడం: సాధారణ రోజుల్లో కంటే పొగమంచులో ..ముందున్న వాహనానికి మరింత ఎక్కువ దూరం పాటించాలి. ముందు వాహనం సడన్‌గా బ్రేక్ వేస్తే.. మీకు స్పందించడానికి.. అదనపు సెకన్లు అవసరం అవుతాయి.
వైపర్లు, డీఫాగర్ వాడకపోవడం: మంచు వల్ల విండ్‌షీల్డ్‌పై తేమ, మసక ఏర్పడతాయి. విండ్‌షీల్డ్ వైపర్లు, అలాగే.. కారులోని డీఫాగర్ లేదా ACని సరిగ్గా వాడకపోతే.. అద్దాలపై మంచు పేరుకు పోయి బయట ఏమీ కనిపించదు.
మ్యూజిక్ బిగ్గరగా పెట్టడం & ఫోన్ వాడకం: పొగమంచులో.. కంటి చూపుతో పాటు చెవి కూడా చాలా ముఖ్యం. హైవేలపై.. వచ్చే ఇతర వాహనాల హారన్ శబ్దాలు వినపడటానికి.. కారులో మ్యూజిక్ సౌండ్ తగ్గించాలి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చూస్తూ అస్సలు డ్రైవ్ చేయకూడదు.
రోడ్డు అంచులను గైడ్‌గా వాడండి: మధ్యలో ..ఉండే వైట్ లేదా ఎల్లో లైన్లు, అలాగే.. రోడ్డు కుడి వైపు అంచులను చూస్తూ.. వాహనాన్ని మీ లేన్‌లోనే నడపండి.
అవసరమైతే సురక్షితమైన చోట ఆగండి: పొగ మంచు మరీ దట్టంగా ఉండి, ముందున్న.. రోడ్డు అస్సలు కనిపించకపోతే.. వాహనాన్ని రోడ్డుకు పూర్తిగా ఎడమ వైపున (లేదా నిర్దేశించిన సేఫ్ ఏరియాలో) ఆపి, లైట్లు, హజార్డ్ లైట్లు ఆన్ చేసి పరిస్థితి మెరుగు పడే వరకు వేచి ఉండండి. బైక్ నడిపే వారు రోడ్డుపై తడి కారణంగా.. స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.