Samyukta Menon:మలయాళీ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కేరళ రాష్ట్రం పాలక్కడ్ లో జన్మించిన ఈమె.. చిన్మయ విద్యాలయాలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, త్రిసూర్లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. 2016లో పాప్కార్న్ అనే మలయాళం సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన సంయుక్త. 2018 లో కలరి సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే తొలిసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం భీమ్లా నాయక్ చిత్రంతోనే అనే చెప్పాలి. ఇందులో రానా భార్యగా నటించి మెప్పించిన సంయుక్త మీనన్.. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైంది.
సార్ సినిమాతో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత విరూపాక్ష, డెవిల్, లవ్ మీ, అఖండ 2, నారీ నారీ నడుమ మురారి అంటూ పలు చిత్రాలలో నటించింది. ఇకపోతే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న హైందవ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు యాక్షన్ స్పిరుచ్యువల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పైగా దీపావళి సందర్భంగా చిత్రం బృందం వరుస ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న సంయుక్త మీనన్.. తాను స్నానం చేసేటప్పుడు బకెట్లో కల్లు ఉప్పు వేసుకొని స్నానం చేస్తాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
హైందవ సినిమా స్టోరీ గురించి ప్రస్తావన రాగా.. మీరు ఎలాంటి నమ్మకాలను నమ్ముతారు అని ప్రశ్నించింది. దీనికి సంయుక్త మాట్లాడుతూ.. “నేను దిష్టిని ఎక్కువగా నమ్ముతాను. నేను ఎక్కడికైనా షూటింగ్లకు వెళ్లినా.. లేదా బయటకు వెళ్లినా వెంటనే జబ్బు పడిపోతాను. ఇకపోతే ప్రస్తుత కాలంలో అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాము కాబట్టి ఉప్పుతో దిష్టి తీయించుకుంటాము. సాధారణంగా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే మిరపకాయలు, ఉప్పుతో దిష్టి తీసి ఆ ఉప్పును , మిరపకాయలను మంటల్లో వేసి దిష్టి తీసే వాళ్ళు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాము. కాబట్టి అవన్నీ కుదరవు . అందుకే నేను స్నానం చేసేటప్పుడు నీటిలో కల్లు ఉప్పు వేసుకొని స్నానం చేస్తాను” అంటూ తెలిపింది సంయుక్త మీనన్. మొత్తానికైతే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:2027సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న చిత్రాలివే!
సంయుక్త మీనన్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రామ్ 23వ చిత్రంతో పాటు హైందవ, మహారాగ్ని : క్వీన్ ఆఫ్ క్వీన్స్, ది బ్లాక్ గోల్డ్, రామ్, బెంజ్, కాలియన్ వంటి చిత్రాలతో పాటు గువ్వల చెరువు ఘాట్ వంటి చిత్రాలు , సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.