E-Paper
Advertisement

పిల్లలు ఇష్టంగా తినే పెరి పెరి మసాలా.. తయారీ విధానం ఇదిగో

పిల్లలు ఇష్టంగా తినే పెరి పెరి మసాలా.. తయారీ విధానం ఇదిగో
Advertisement

Peri Peri Masala Recipe| సాయంత్రం వేళ వేడివేడి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నప్పుడు వాటిపై కొంచెం పెరి పెరి మసాలా చల్లుకుంటే ఆ రుచే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ఈ స్పైసీ మసాలాను ఇష్టపడతారు. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో వెజెస్, శాండ్‌విచ్‌లు, పాప్‌కార్న్ వంటి ఎన్నో స్నాక్స్‌లో ఈ మసాలా వల్ల రుచి మరింత పెరుగుతుంది. అయితే ప్రతిసారీ మార్కెట్‌లో పెరి పెరి మసాలా కొనాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పదార్థాలతో ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

పెరి పెరి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు

ఈ మసాలా తయారీకి ప్రత్యేకమైన పదార్థాలు అవసరం లేదు. సాధారణంగా వంటింట్లో లభించే కొన్ని మసాలాలతోనే రుచికరమైన పెరి పెరి పౌడర్ తయారు చేయవచ్చు.

  •  ఎండబెట్టిన టమోటాలు ఒక చిన్న గిన్నె
  •  జీలకర్ర పొడి 2 టీస్పూన్లు
  •  మిరియాల పొడి 1 టీస్పూన్
  •  ఒరేగానో 2 టీస్పూన్లు
  •  వెల్లుల్లి పొడి 2 టీస్పూన్లు
  •  రుచికి సరిపడా ఉప్పు
  •  కొద్దిగా సిట్రిక్ యాసిడ్
  •  కొద్దిగా చక్కెర
  •  కాశ్మీరీ ఎర్ర మిరప పొడి 2 టీస్పూన్లు
  •  కొద్దిగా కార్న్‌ఫ్లోర్

ఇంట్లోనే పెరి పెరి మసాలా  తయారు చేసుకునే రెసిపీ

  • ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఎండబెట్టిన టమోటాలను వేసుకోండి. టమోటాల్లో తేమ లేకుండా చూసుకోవాలి.
  • ఇప్పుడు అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి వేయండి. తర్వాత ఒరేగానో, వెల్లుల్లి పొడి కలపండి.
  • తరువాత కశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్, తగినంత ఉప్పు వేయండి. కొద్దిగా సిట్రిక్ యాసిడ్, చక్కెర కూడా కలపండి. చివరగా కార్న్‌ఫ్లోర్ జోడించండి.
  • ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి అన్ని పదార్థాలను మెత్తగా పొడి అయ్యే వరకు గ్రైండ్ చేయండి. అవసరమైతే మరోసారి మిక్సీ పట్టండి.
Advertisement

అంతే.. ఎంతో రుచికరమైన ఇంట్లో తయారుచేసిన పెరి పెరి మసాలా రెడీ.

పెరి పెరి మసాలాను ఉపయోగించే స్నాక్స్‌ ఇవే

ఈ మసాలాను కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్‌కే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల స్నాక్స్‌లో ఉపయోగించవచ్చు.
ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో వెజెస్, పాప్‌కార్న్, పనీర్ టిక్కా, శాండ్‌విచ్‌లు, చిప్స్. ఈ మసాలాతో సాధారణ స్నాక్స్ కూడా మరింత రుచికరంగా ఉంటాయి.

Advertisement

Also Read: రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం పెరగాలంటే మీ భాగస్వామిని రోజూ ఈ 5 ప్రశ్నలు అడగండి

మసాలా ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి

తయారుచేసిన మసాలాను పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. డబ్బాలోకి తేమ చేరకుండా జాగ్రత్తపడాలి. మసాలా తీసుకునేటప్పుడు ఎప్పుడూ పొడి చెంచానే ఉపయోగించాలి. నేరుగా ఎండ తగలని ప్రదేశంలో డబ్బా ఉంచాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే పెరి పెరి మసాలా సుమారు 3 నుంచి 4 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.

Also Read: చాణక్య నీతి.. ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ 5 లక్షణాలు గమనించండి

Related News

ఈ సీక్రెట్ తెలిస్తే ఇక బయట కొనడం మానేస్తారు.. 15 నిమిషాల్లో ఇంట్లోనే వెజ్ డ్రై మంచూరియా!

అభిప్రాయ భేదాలున్నా భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు.. బంధాన్ని కాపాడే 7 మార్గాలు

తల్లిదండ్రుల మాటే వేదం.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు విధేయంగా ఉంటారు

మోక్షం ఎలా లభిస్తుంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత సత్యాలు ఇవే

స్మార్ట్‌ఫోన్ కారణంగా వెన్నునొప్పి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

చలికాలం అలర్ట్..బీపీ,షుగర్ ఉన్నవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..ఈ విటమిన్ లోపంతో బట్టతల ముప్పు!

Big Stories

Advertisement
×