Numerology Obedient Kids| చెప్పిన మాట వినే పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. పెద్దలను గౌరవిస్తూ, మంచి మాటలను పాటిస్తూ ఉంటే ప్రతి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. అయితే పిల్లలందరి స్వభావం ఒకేలా ఉండదు. కొందరు తల్లిదండ్రులు చెప్పిన మాటను వెంటనే వింటారు. మరికొందరు తమకు నచ్చినట్లుగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ న్యూమరాలజీ ప్రకారం మూడు మూలఅంకాల పిల్లలు చాలా విధేయులుగా ఉంటారని మీకు తెలుసా? ఆ మూడు మూలఅంకాల పిల్లల వివరాలు తెలుసుకుందాం.
న్యూమరాలజీ ప్రకారం.. మూలఅంకం 2కు చంద్రుడు అధిపతి. ఈ సంఖ్య కలిగిన పిల్లలు సున్నితమైన మనసు, భావోద్వేగాలు కలిగి ఉంటారు. ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారి మూలఅంకం 2 అవుతుంది. ఈ పిల్లలు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని బాధపెట్టడం ఇష్టపడరు. అందుకే పెద్దల మాటలకు విలువ ఇస్తారు. ప్రేమగా చెప్పిన మాటలను త్వరగా అర్థం చేసుకునే స్వభావం ఉంటుంది.
Also Read: ఓటమి ఎదురుగా ఉన్నప్పుడు ఈ తప్పు చేయకండి.. బలమైన శత్రువును ఎదుర్కోవాల్సిన వ్యూహం
మూలఅంకం 4కు రాహువు అధిపతి అని న్యూమరాలజీ చెబుతోంది. ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు ఈ సంఖ్యకు చెందుతారు.
ఈ పిల్లలు ఆచరణాత్మకంగా ఆలోచిస్తారని, క్రమశిక్షణను ఇష్టపడతారు. తమ పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో పెద్దలు పెట్టిన నియమాలను పాటిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ఆసక్తి చూపుతారని అంకజ్యోతిష్యం వివరిస్తోంది. వీరి వ్యవస్థీకృత ఆలోచనా విధానం తల్లిదండ్రులకు నచ్చుతుంది.
న్యూమరాలజీ ప్రకారం మూలఅంకం 6కు శుక్రుడు అధిపతి. ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో పుట్టిన పిల్లల మూలసంఖ్య 6 అవుతుంది.
ఈ సంఖ్య కలిగిన పిల్లలు ప్రేమ, ఆప్యాయత, కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారట. తల్లిదండ్రులను గౌరవిస్తూ, కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ఇతరుల భావాలను గుర్తించి స్పందించే స్వభావం ఉంటుంది.
Also Read: మీ తప్పు లేకపోయినా సారీ చెబుతున్నారా.. ప్రతి విషయంలో మీరే తగ్గితే వచ్చే సమస్యలు ఇవే
మూలఅంకాల ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయడం అంకజ్యోతిష్యంలో ఉన్న నమ్మకం మాత్రమే. పుట్టిన తేదీకి, పిల్లల విధేయతకు శాస్త్రీయంగా నిరూపితమైన సంబంధం లేదు. పెంపకం, పరిసరాలు, అనుభవాలు కూడా పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కాబట్టి పిల్లలను ఓర్పుతో అర్థం చేసుకోవాలి. ప్రేమగా మాట్లాడి, మంచి అలవాట్లను నేర్పించాలి. భయంతో కాకుండా నమ్మకంతో తల్లిదండ్రుల మాట వినేలా ప్రోత్సహించాలి.