E-Paper
Advertisement

లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!

లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తోందా? దీని వెనక ఉన్న పెద్ద మోసం ఇదే!
Advertisement

Free credit card scam: ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్‌కు “మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చింది” అంటూ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో పైసా ఖర్చు లేకుండా కార్డు వస్తుందని ఆశపడి వివరాలు ఇస్తే..క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఉచిత క్రెడిట్ కార్డుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా భారీ మోసాలకు తెరలేపారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతోంది? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ? బ్యాంకులు వసూలు చేసే అసలు క్రెడిట్ కార్డ్ ఛార్జీల వివరాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తర్వాత క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగింది. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న.. సైబర్ నేరగాళ్లు, సామాన్యులను బురిడీ కొట్టించడానికి ‘లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్’ అనే కొత్త ఎర వేస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల పేర్లు చెప్పి, ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఫీజు లేకుండానే రూ. 5 లక్షల లిమిట్‌తో కార్డు ఇస్తామంటూ నమ్మిస్తున్నారు.

ఈ కొత్త స్కామ్ ఎలా జరుగుతోంది? :

Advertisement

నకిలీ కాల్స్ &వాట్సాప్ లింకులు: ముందుగా బ్యాంక్ ప్రతినిధులమంటూ ఫోన్ చేసి, మీ సిబిల్ స్కోర్ బాగుందని, ప్రీ-అప్రూవ్డ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ వచ్చిందని నమ్మిస్తారు. ఆ తర్వాత వాట్సాప్‌లో.. ఒక నకిలీ వెబ్‌సైట్ లింక్ లేదా APK ఫైల్ పంపుతారు.

KYC & కార్డు యాక్టివేషన్ పేరుతో దోపిడీ: ఆ లింక్ ఓపెన్ చేసి మీ పాన్ కార్డ్, ఆధార్ వివరాలు, పాత కార్డు నంబర్ ఎంటర్ చేయమంటారు. చివరగా కార్డు యాక్టివేషన్ కోసం ఫోన్‌కు వచ్చిన OTP చెప్పమంటారు. మీరు OTP చెప్పిన మరుక్షణమే మీ అకౌంట్ నుండి డబ్బు మాయమవుతుంది.

Advertisement

రివార్డ్ పాయింట్లు & లిమిట్ : కొందరికి కొత్త కార్డు బదులుగా, మీ పాత కార్డును ఉచితంగా అప్‌గ్రేడ్ చేస్తామని లేదా రివార్డ్ పాయింట్లు క్యాష్‌గా మారుస్తామని చెప్పి వివరాలు సేకరిస్తున్నారు.

గమనిక: ఇలాంటి ఖరీదైన ప్రీమియం కార్డులను ఎలాంటి షరతులు లేకుండా పూర్తి ఉచితంగా ఇస్తామని ఎవరైనా ఫోన్ చేస్తే అది కచ్చితంగా ఫేక్ కాల్ అని గుర్తించండి.

Also Read: ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !

మోసపోకుండా ఉండాలంటే పాటించాల్సిన 4 జాగ్రత్తలు:

అధికారిక యాప్స్ మాత్రమే వాడండి: క్రెడిట్ కార్డ్ కావాలంటే.. నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి లేదా ఆయా బ్యాంకుల అధికారిక మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి.

APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయెద్దు: వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో వచ్చే .apk ఫైల్స్‌ను పొరపాటున కూడా ఇన్‌స్టాల్ చేయకండి. ఇవి మీ ఫోన్ స్క్రీన్‌ను హ్యాక్ చేస్తాయి.

OTP & CVV ఎవరికీ చెప్పొద్దు: ఏ బ్యాంక్ ఉద్యోగి కూడా ఫోన్ చేసి మీ కార్డు CVV నంబర్ గానీ, OTP గానీ అడగరు.

కస్టమర్ కేర్ నంబర్ చెక్ చేయండి: మీకు అనుమానం వస్తే.. వెంటనే ఆ బ్యాంక్ అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి ఆఫర్ నిజమో కాదో నిర్ధారించుకోండి. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్) కు కంప్లైంట్ చేయండి.

Related News

ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో నెట్‌వర్క్ ఫుల్!

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!

రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!

ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !

యాపిల్, శాంసంగ్‌లకు చెక్ పెట్టబోతున్న OpenAI.. త్వరలోనే యాప్స్ లేని కొత్త స్మార్ట్‌ఫోన్!

జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.450 రీఛార్జ్‌తో ఫ్రీ జియో హాట్‌స్టార్, ఏడాది పాటు కాన్వా ప్రో లైట్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

Big Stories

Advertisement
×