BigTV English

Lunchbox Recipe: బ్యాచిలర్స్ కోసం లంచ్ బాక్స్ రెసిపీ.. నిమిషాల్లో చేసుకోవచ్చు..

Lunchbox Recipe: బ్యాచిలర్స్ కోసం లంచ్ బాక్స్ రెసిపీ.. నిమిషాల్లో చేసుకోవచ్చు..

Lunchbox Rice Recipe for Bachelors: సోలో లైఫే సో బెటర్.. అని అంటారు. కానీ.. అనుభవిస్తేనే కదా తెలుస్తుంది బ్యాచిలర్స్ కష్టాలేంటో. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్లి.. అక్కడ అష్టకష్టాలు పడుతుంటారు. దేనికైనా అడ్జెస్ట్ అవ్వొచ్చు కానీ.. నోటికి రుచించని ఫుడ్ తిని మాత్రం అడ్జస్ట్ కాలేం. వంటరాక, బయట వండినవి తినలేక ఆ లైఫే చాలా కష్టం.


పోనీ వచ్చీ రాకో ఏదొలా వంట చేసుకుని తినేద్దామనుకున్నా.. అందులో ఏదొకటి తక్కువై.. మనం చేసుకున్నది మనకే నచ్చదు. ఇంకా దానిని ప్యాక్ చేసుకుని ఆఫీసులకు ఏం తీసుకెళ్తారు. అందుకే మీ కోసం ఒక లంచ్ బాక్స్ రెసిపీని పరిచయం చేస్తున్నాం. అదెలా చేసుకోవాలో.. అందుకు ఏయే పదార్థాలు కావాలో చూద్దాం.

Also Read: షుగర్ పేషెంట్లు పాలు తాగొచ్చా లేదా.. నిపుణులు ఏం చెబుతున్నారు


లంచ్ బాక్స్ రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఆయిల్ – 2 టేబుల్ స్పూన్స్

జీలకర్ర – కొద్దిగా

ఆవాలు – కొద్దిగా

పచ్చిశనగపప్పు – కొద్దిగా

కరివేపాకు – 2-3 రెమ్మలు

సన్నగా తరిగిన వెల్లుల్లి – 1 స్పూన్

సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1

తరిగిన మిర్చి – 2

సన్నగా తరిగిన క్యాప్సికం – 1

సన్నగా తరిగిన టొమాటో – 1

పసుపు – 1/4 టీ స్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

చిల్లీ ఫ్లేక్స్ – 1 టేబుల్ స్పూన్

తరిగిన కొత్తిమీర – కొద్దిగా

నార్మల్ రైస్ లేదా బాసుమతి అన్నం – 1-1/2 కప్పు

లంచ్ బాక్స్ రైస్ తయారీ విధానం

స్టవ్ పై నాన్ స్టిక్ కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, మిర్చి వేసి వేయించుకోవాలి.

తర్వాత తరిగిన క్యాప్సికం, తరిగిన టొమాటో వేసి మగ్గనివ్వాలి. దీనిలో పసుపు, టేస్ట్ కి కావలసినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. అందులో ఉడికించుకున్న అన్నం వేసి.. హై ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. లంచ్ బాక్స్ లోకి టేస్టీ రైస్ రెడీ.

బ్యాచిలర్సే కాదండోయ్. టైమ్ లేనపుడు మీరు కూడా ఈ రెసిపీని సింపుల్ గా చేసుకుని తినొచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×