Diabetes Patients: ప్రస్తుతం ఉన్న కాలంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువగా ఏ వ్యాధితో బాధపడుతున్నారు అంటే ముందంజలో డయాబెటీస్ వ్యాధే ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వారిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు తరచూ తీసుకోవాల్సి ఉంటే మరికొన్నింటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. దీంతో కళ్లు తిరగడం, అలసట, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి.
డయాబెటీస్ ఉన్న వారు ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తక్కువగా తినాల్సి ఉంటుంది. అంతేకాదు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మరోవైపు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలోని ఎముకలు బలంగా మారుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్న వారు పాలు తాగితే ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అందువల్ల రోజువారి ఆహారంలో పాలను కూడా చేర్చుకుంటారు. కానీ డయాబెటిస్ ఉన్న వ్యాధిగ్రస్తులు పాలు తాగడం మంచిదా కాదా అనే విషయం మాత్రం అందరికీ ఓ సందేహం ఉంటుంది.
పాలలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు పాలను తీసుకోవడం వల్ల మరింత సమస్య పెరుగుతుందని భావిస్తారు. కానీ అలాంటి సమస్యలు ఉంటాయనే దానికి ఆధారాలు లేదు. పాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే పాలలో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భోజనం తర్వాత మాత్రమే పాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పాలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేవి చూసుకుని తాగాలి. అంతేకాదు ఇది గుండె జబ్బులు సమస్యలకు కూడా దారితీస్తుంది కాబట్టి తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవడం మంచిది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)