BigTV English

Vinesh’s Husband: అసలైన వారి నుంచి మద్దతే లేదు: వినేశ్ భర్త

Vinesh’s Husband: అసలైన వారి నుంచి మద్దతే లేదు: వినేశ్ భర్త

Vinesh’s Husband on Retirement, Reveals not getting any Support From Wfi:పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కి కాస్ కోర్టులో అన్యాయం జరిగింది. దేశమంతా ఏకతాటిపైకి వచ్చి తనకి మద్దతు తెలిపితే, ఎంతో గొప్పగా చూడాల్సిన భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి కనీస మద్దతు లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పుడదే విషయంపై వినేశ్ భర్త సోమ్ వీర్ రాథీ స్పందించారు.


వినేశ్ రావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అంతేకాదు రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందా?  లేదా? అనే అంశంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. తాజాగా తను మళ్లీ బరిలోకి దిగుతానని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరి అదెంత వరకు నిజమో తెలీదు.

కానీ ఇండియాలో దిగిన తర్వాత రిటైర్మెంట్ పై వినేశ్ ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో నెట్టింట సందేహాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా వినేశ్ భర్త సోమ్ వీర్ రాథి మాట్లాడుతూ ప్రజల నుంచి ఇంతటి గొప్ప అభిమానాన్ని మేం ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. అయితే మేమంతా క్లిష్ట సమయంలో ఉన్నాం.. కాస్ తీర్పు అనుకూలంగా రాలేదు. ఇలాంటప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్య మాకు అండగా లేకపోవడం విచారకరమని అన్నాడు.


ఫెడరేషన్ నుంచి అథ్లెట్లకు మద్దతు లేకపోతే నిర్భయంగా ఎలా ప్రదర్శన చేస్తారు? న్యాయం కోసం ఎలా పోరాడతారని సోమ్ వీర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ మాటలు నెట్టింట మళ్లీ హీట్ పుట్టించాయి. దీంతో జనం అందరూ ఫెడరేషన్ పై విరుచుకు పడుతున్నారు. మీకు మీకు గొడవలుంటే బయట చూసుకోండి. మీరంతా కలిసి వినేశ్ కి అన్యాయం చేస్తే సహించేది లేదని వార్నింగులు ఇస్తున్నారు.

Also Read: అమ్మ ఎంతో కష్టపడి.. మమ్మల్ని పెంచింది: వినేశ్ ఫోగట్

ఇలాగే చేస్తే భారతదేశ ప్రజలు ఎప్పటికి మిమ్మల్ని క్షమించరు. తగిన శాస్తి చేస్తారని హెచ్చరికలు చేస్తున్నారు.  ముంబై కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్యాని ఎలా ట్రోల్ చేశామో గుర్తు చేసుకోండి. సామాజిక మాధ్యమాల్లో ఉతికి ఆరబెట్టేస్తామని గట్టిగానే వార్నింగులు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా వినేశ్ సోదరుడు హర్విందర్ ఫోగట్ మాట్లాడుతూ.. తను రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకునేలా మాట్లాడతామని అన్నారు. మా పెదనాన్న మహావీర్ ఫోగట్ కూడా వచ్చి మాట్లాడతానని, అవసరమైతే ఈసారి ఒలింపిక్స్ కి తనే సన్నద్ధం చేస్తానని తెలిపారు. ఇలా కుటుంబ సభ్యులందరూ తనకి మద్దతుగా ఉండటం వల్ల, బహుశా తన రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గుతుందని అంతా అనుకుంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×