BigTV English

Palakura Chutney: పాలకూరతో స్పైసీ పచ్చడి ఇలా చేసేయండి, ఆరోగ్యం పైగా ఎంతో రుచి

Palakura Chutney: పాలకూరతో స్పైసీ పచ్చడి ఇలా చేసేయండి, ఆరోగ్యం పైగా ఎంతో రుచి
పాలకూరలో ఉండే పోషకాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. పాలకూరను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకున్నా మంచిదే. కానీ దీన్ని తినేవారి సంఖ్య చాలా తక్కువ. మీకు పాలకూరతో ఉండే కూరలు నచ్చకపోతే ఇక్కడ మేము స్పైసీగా పచ్చడి ఎలా చేయాలో ఇచ్చాము. ఈ రెసిపీ ఫాలో అయిపోండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ పాలకూర పచ్చడిని ఒకసారి చేసుకుంటే రెండు రోజులు పాటు తినవచ్చు. పాలకూర పచ్చడి రెసిపీ ఇదిగో.


పాలకూర పచ్చడికి కావలసిన పదార్థాలు
పాలకూర తరుగు – ఒకటిన్నర కప్పు
నూనె – నాలుగు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – చిటికెడు
ఎండుమిర్చి – ఆరు
మెంతులు – చిటికెడు
జీలకర్ర – పావు స్పూను
ఆవాలు – పావు స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
చింతపండు – ఉసిరికాయ సైజులో
ఉల్లిపాయ – ఒకటి
ధనియాలు – ఒక స్పూను

పాలకూర పచ్చడి రెసిపీ
• పాలకూరను సన్నగా తరిగి నీళ్లల్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇసుక లేకుండా చూసుకోవాలి.
• దీనికోసం నీటిలో కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి.
• అప్పుడే ఇసుక పూర్తిగా పోతుంది. రెండు మూడు సార్లు జల్లెడలో వేసి కడగాలి.
• ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
• ఆ నూనెలో ధనియాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, మెంతులు వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
• ఇప్పుడు అదే కళాయిలో పాలకూరను వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
•  అలాగే చింతపండును కూడా అందులోనే వేసి బాగా ఉడికించుకోవాలి.
• పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. పాలకూర పచ్చివాసన పోయి దాకా కలుపుతూ ఉండాలి.
• ఆ తర్వాత ఆ పాలకూరను కూడా తీసి చల్లార్చి మిక్సీలో వేయాలి.
• ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి వంటివి కూడా వేసి మిక్సీ చేసుకోవాలి.
• ఇప్పుడు పచ్చి ఉల్లిపాయలను కూడా అందులో వేసి బాగా రుబ్బుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
• ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
• ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
• అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించి పచ్చడిపై పోయాలి.
• అంతే టేస్టీ స్పైసీ పాలకూర పచ్చడి రెడీ అయినట్టే.
• దీని నుంచి ఎలాంటి పచ్చి వాసన రాదు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని తిని చూడండి. రుచి అదిరిపోతుంది.
• పైగా పాలకూరలోని పోషకాలు అన్నీ కూడా శరీరంలో చేరుతాయి .


పాలకూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పాలకూరలో మెగ్నీషియం,  విటమిన్ సి, విటమిన్ ఏ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారించడంలో ముందుంటాయి. అలాగే గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు పాలకూరను తరచూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా పాలకూరకు ఉంది.  పాలకూర తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఎలాంటి విషాలు, వ్యర్ధాలు రక్తంలో ఉండవు. కాబట్టి పాలకూరను వారానికి కనీసం రెండు మూడు సార్లు తినేలా ప్లాన్ చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×