BigTV English

Rusk Payasam: ఇంట్లో రస్కులు మిగిలిపోయాయా? వాటితో ఇలా టేస్టీ పాయసం చేసేయండి

Rusk Payasam: ఇంట్లో రస్కులు మిగిలిపోయాయా? వాటితో ఇలా టేస్టీ పాయసం చేసేయండి

రస్కులు తినే వారి సంఖ్య అధికమే. ముఖ్యంగా టీ తాగుతూ రస్కులు తింటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ రస్సులు మిగిలిపోతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు ఏదైనా అప్పటికప్పుడు చేసుకుని స్వీట్ తినాలనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మిగిలిపోయిన రస్కులతో పాయసం చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా సులభంగా అయిపోతుంది. మీ తీపి తినాలన్న కోరికను తీర్చేస్తుంది. ఒక్క అరగంటలో ఈ రస్క్ పాయసం చేసెయ్యొచ్చు. రెసిపీ చాలా సులువు.


రస్క్ పాయసానికి కావలసిన పదార్థాలు
రస్కులు – ఏడు
పాలు – ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు – గుప్పెడు
యాలకుల పొడి – పావు స్పూను
చక్కెర – ఐదు స్పూన్లు
నెయ్యి – ఒక స్పూను
కిస్మిస్లు – గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము – రెండు స్పూన్లు

రస్క్ పాయసం రెసిపీ
1. మిగిలిపోయిన రస్కులను చేత్తోనే ముక్కలుగా నలిపేయండి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
3. ఆ నూనెలో జీడిపప్పులు, కిస్‌మిస్లు, కొబ్బరి తురుము వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
4. ఇప్పుడు అదే కళాయిలో రస్కులను వేసి వేయించండి.
5. మరోపక్క పాలను కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి.
6. ఇప్పుడు వేయించిన రస్కుల్లో పాలను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి.
7. అందులోనే పంచదారను కూడా వేసి బాగా కలపండి.
8. అలాగే యాలకుల పొడిని కూడా వేయండి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్నమంట మీద ఉడికించుకోండి.
10. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కొబ్బరి తురుము, కిస్మిస్లు వేసి బాగా కలపండి.
11. ఇది చిక్కగా పాయసం లాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రస్క్ పాయసం రెడీ అయినట్లే.


Also Read: నోరూరించే ఓట్స్ పకోడీ.. దీన్ని చేయడం చాలా ఈజీ

ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఈ రస్క్ పాయసం ప్రయత్నించండి. ఇది రుచిగా ఉండటమే కాదు ఆకలిని కూడా తీరుస్తుంది. మీకు కావాలనుకుంటే దీనిలో బెల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. పంచదార తినడం ఇష్టం లేనివారు ఇలా బెల్లాన్ని వేసి టేస్టీ పాయసం చేసుకోవచ్చు.  రస్కులతో పాయసం ఎక్కువ సమయం పట్టదు. పాలు కాచి చల్లార్చి రెడీగా ఉంటే చాలు. కేవలం పావుగంటలో ఈ పాయసం రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. చాలా తక్కువ సమయంలో అయిపోయే ఈ స్వీట్ మీకు ఖచ్చితంగా నచ్చడం ఖాయం.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×