BigTV English
Advertisement

Bad Girl: మరో వివాదంలో డైరెక్టర్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..

Bad Girl: మరో వివాదంలో డైరెక్టర్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..

Bad Girl: సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. హిట్ అయిన ప్రతి సినిమా కంటెంట్ బాగుందని కూడా చెప్పలేము. మంచి సందేశాత్మక కథలతో సినిమాలో వచ్చినా కూడా ఆ సినిమాలకు జనాల నుంచి రెస్పాన్స్ రాదు. అవుతుంది అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు అయితే రిలీజ్ ముందే ఊహించని సంచలనం సృష్టిస్తాయి. సినిమాల్లో హీరోయిన్లు చేసే కొన్ని వివాదాస్పదంగా మారుతాయి. హీరో చేస్తే మరికొన్ని కూడా వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తాయి. తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది బ్యాడ్ గర్ల్ అనే సినిమా. తమిళ ఇండస్ట్రీలో తనకి కుదిరిన ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ వీడియో పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారని తెలుస్తుంది. అసలు మేటర్ ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..


బ్యాడ్ గర్ల్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మించారు.. ఈ చిత్ర టీజర్ పై అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే అసలు ఆ రేంజ్ ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది. ఈ సినిమాలో ఒక పద్ధతి గల బ్రాహ్మణ అమ్మాయిని చాలా బోర్డ్ గా చూపించారు దర్శకులు.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీస్తుంది. అలాగే ఈ సినిమాను బ్యాన్ చేయాలని వార్తలు కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇండస్ట్రీలో వెయిట్ ఉన్న డైరెక్టర్ వెట్రిమారన్ ఇలాంటి సినిమా ఎలా తీస్తాడని ఎవ్వరుఊహించరు ఓ రేంజ్ లో తనని ఆడిపోసుకుంటున్నారు. ఒక్క వెట్రి మారన్ నే కాకుండా హీరో విజయ్ సేతుపతిపై కూడా ఘోరంగా తిట్లు పడుతున్నాయి.

అసలు కారణమేంటంటే.. వెట్రిమారన్, పా రంజిత్ లాంటి వారికి వర్ణ వివక్ష చూపిస్తారని అందుకే ఈ బ్యాడ్ గర్ల్ సినిమా విషయంలో ప్రచారం చేస్తున్నారు. సినిమాను తప్పుగా చూపించడంతో పాటుగా దాన్ని ఓరేంజ్ లో ప్రచారం చేయడం గమనార్హం. డబ్బుల కోసం ఇలా ఏమైనా చేస్తారని ప్రజలు మండిపడుతున్నారు. అలాగే విజయ్ సేతుపతి చేసిన పోస్ట్ పై కూడా పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.. యువతను ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు ఇలాంటి ప్రమోషన్స్ కావాలి అని ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మీ ఇంట్లో ఉన్న ఆడ పిల్లలతో కూడా ఇలాంటి సినిమాలు లేదా అలాంటి పాత్రల్లో చూపిస్తారా అంటూ ఇప్పుడు తమిళ యువ సోషల్ మీడియా అంతా రచ్చ లేచిపోతుంది. ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటివెట్రిమారన్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దర్శకునితో మాకు సినిమా వద్దని తారక్ కూడా సినిమా చెయ్యడానికి లేదు అని అంటున్నారు. సినిమాలు తీయడానికి మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏమైనా ఈ సినిమాను వెంటనే ఆపేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వెట్టిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు తమిళంలో వస్తున్న సినిమాకు వివాదాస్పద వ్యాఖ్యలు రావడంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయొద్దని వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బ్యాడ్ గర్ల్ గా శృంగారానికి బానిస అయ్యిన అమ్మాయి పాత్రలో అంజలి శివరామన్ నటించింది. కేవలం టీజర్ తోనే ఈ సినిమాకు విభాగాలు మొదలయ్యాయి.. మరి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి..


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×