BigTV English

OTT Movie : ఇళ్లు వదలని మనుషులు… ఆ ఇంట్లోకి వెళ్లాలంటే దయ్యాలకు హడల్

OTT Movie : ఇళ్లు వదలని మనుషులు… ఆ ఇంట్లోకి వెళ్లాలంటే దయ్యాలకు హడల్

OTT Movie : దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గానీ, దయ్యాల సినిమాలు చూస్తే మాత్రం మనుషులు భయపడుతూ ఉంటారు. ఒకప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరించి, దయ్యాలు తిరుగుతున్నట్టు పెద్దవాళ్లు చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం సినిమాలలోనే ఎక్కువగా దయ్యాలను చూస్తున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా ఈ దయ్యాలకు భయపడుతూ ఉంటారు. ఈ క్రమంలోని ప్రపంచం అంతా దుష్టశక్తితో అంతమైపోయిందని, ఒక కుటుంబం అడవిలో ఒంటరిగా బతుకుతుంది. ఆ దుష్ట శక్తి నుంచి వీళ్ళు ఎదుర్కునే సమస్యలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నెవర్ లెట్ గో‘ (Never let go). 2024లో విడుదలైన ఈ అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీకి అలెగ్జాండ్రే అజా దర్శకత్వం వహించారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో ప్రముఖ నటి హాలీ బెర్రీ నటించింది. నెవర్ లెట్ గో సెప్టెంబర్ 16, 2024న న్యూయార్క్ నగరంలోని రీగల్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించబడి, సెప్టెంబర్ 20, 2024న యునైటెడ్ స్టేట్స్‌లో లయన్స్‌గేట్ ద్వారా విడుదల చేయబడింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. ఒక దుష్టశక్తి వలన ప్రపంచమంతా అంతమైపోయిందని నమ్ముతూ ఉంటుంది. ఆ దుష్టశక్తి ఇంట్లోకి రాకుండా వీళ్ళు ఒక దైవ శక్తి ఉన్న చెట్టుతో ఇంటిని నిర్మించుకుంటారు. ఆ ఇంట్లో ఉన్నంతవరకు దుష్టశక్తి అక్కడికి చేరలేదు. ఆహారం కోసం ఆ ఇంటి నుంచి ఒక తాడును చుట్టుకుని వెతుకుతూ ఉంటారు. ఇంటిలో దైవ శక్తి ఉండటంతో ఆ తాడు ఉన్నంత వరకు దుష్టశక్తి ఏమీ చేయలేదని నమ్ముతారు. అలా అక్కడ దొరికిన దానిని మాత్రం తింటూ బ్రతుకుతారు. ఇలా జరుగుతున్న క్రమంలో దుష్టశక్తి వీళ్లను చంపడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఒకానొక సమయంలో హీరోయిన్ తాడును జారవిడుచుకోవడంతో ఆమెలోకి దుష్టశక్తి ప్రవేశిస్తుంది. తన వల్ల పిల్లలు చనిపోతారనితెలుసుకొని, హీరోయిన్ తనకుతానే కత్తితో గొంతు కోసుకొని  చనిపోతుంది.

ఆ తరువాత చిన్నపిల్లలు ఆ దుష్టశక్తి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. ఆ ప్రాంతంలోకి బయటనుంచి ఒక వ్యక్తి వస్తాడు. అయితే అతడు దయ్యం అనుకొని ఆ పిల్లలు గాయపరుస్తారు. అతను అక్కడినుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అతని కూతురు అక్కడికి వచ్చి, తన తండ్రి గాయపడ్డాడని తెలిసి తనని వెతుకుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలు వాళ్ళు నిజంగానే మనుషులని అనుకుంటారు. చివరికి ఆ దుష్ట శక్తికి ఈ పిల్లలు బలవుతారా? ప్రపంచమంతా దుష్ట శక్తి వలన నిజంగానే అంతరించిపోతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నెవర్ లెట్ గో’ (Never let go) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×