Millets: మిల్లెట్స్ తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మిల్లెట్స్ ఎలా వాడాలి..? మిల్లెట్స్ ఎంత పరిమాణంలో తీసుకోవాలి..? మిల్లెట్స్‌లో ఉండే పోషకాలు బాడీకి సరిగ్గా లభించాలంటే ఏం చేయాలి. మిల్లెట్స్ ను కలిపి తినవచ్చా..? లేదంటే దేనికదే వేరు వేరుగా తినాలా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ పేరు బాగా మారుమోగుతుంది. ఎవరూ చూసిన హెల్త్ బెనిఫిట్స్ కోసం చిరుధాన్యాలు వాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఏకంగా చిరుధాన్యాల వాడకం గురించి పుంకాను పుంకాలుగా కథనాలు వస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల నుంచి పెద్ద పెద్ద డాక్టర్ల వరకు మిల్లెట్స్ వాడకం వల్లే కలిగే ప్రయోజనాలు చెప్తున్నారు. కానీ చాలా తక్కువ మందే ఆ మిల్లెట్స్ ఎలా వాడాలి..? ఎంత పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువ వాడకం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా..? అనే విషయాలు చెప్తున్నారు. చాలా మందికి కూడా మిల్లెట్స్ వాడకంలో క్లారిటీ ఉండదు. ఎవరికి తోచినట్టు వాళ్లు వాడేస్తుంటారు. అయితే చిరుధాన్యాల వాడకంలోనూ కొన్ని పద్దతులు ఉంటాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. పద్దతి ప్రకారం తీసుకుంటే చిరుధాన్యాలు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టాలి: ఎటువంటి చిరుధాన్యం అయినా సరే కనీసం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అప్పుడే వాటిని వాడుకోవాలి. ఇక అండు కొర్రలు అయితే కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా టైం ఉంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే చాలా మంచిదట. చెప్తున్నారు. పది గంటలు నానబెడితే అందులోని పోషకాలు పూర్తిగా మన బాడీకి లభిస్తాయట. ఇలా నానబెట్టిన మిల్లెట్స్ మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
విడివిడిగా ఉపయోగించుకోవాలి: మిల్లెట్స్ ఎప్పుడూ కలపకూడదు. అన్ని కలిపి ఉపయోగిస్తే అందులోని పోషకాలు నిరుపయోగం అవుతాయట. ఎప్పుడూ కలపి వండటం కూడా చేయకూడదట. అలా వండటం వల్ల చిరుధాన్యాల వల్ల ఏటువంటి ఉపయోగం ఉండదట. కాబట్టి ఎప్పుడైనా మిల్లెట్స్ దేనికవే సపరేట్‌గా ఉపయోగించాలి. అప్పుడే వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుందట.
మిల్లెట్స్ మారుస్తుండాలి: ఓకే రకం చిరుధాన్యాలను ఎప్పుడూ తినకూడదట. కనీసం రెండు రోజులకు ఒకసారి లేదా గరిష్టంగా నాలుగు రోజులకు ఒకసారి అయినా కచ్చితంగా మిల్లెట్స్ ను మార్చి తినాలట. చిరుధాన్యాలు మార్చి తినడం వల్ల బాడీకి ఫుల్ పోషకాలు లభిస్తాయట.
అన్నంలా వండుకోవడం: ఎప్పుడూ రా చిరుధాన్యాలను తినకూడదట. ఎప్పుడైనా మిల్లెట్స్‌ను అన్నంలా వండుకుని తినడం బెటర్ అని సూచిస్తున్నారు ఆహార నిపుణులు. ఇలా తినడం వల్ల త్వరగా డైజెస్ట్ అవుతాయని లేదంటే డైజెస్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంకా మిల్లెట్స్ తో గటక చేసుకోవడం.. లేదా రొట్టెలు చేసుకోవడం. ఇంకా కషాయాలుగా చేసుకుని కూడా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: ఇక్కడ ఇచ్చిన ఈ వివరాలను కొంత మంది ఆహార నిపుణులు చెప్పిన విషయాల ఆధారంగా.. కొన్ని హెల్త్ జర్నల్స్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీన్ని విశ్వసించాలా వద్దా అన్నది పాఠకుడి విజ్ఞతకే వదిలేస్తున్నాం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు