Rahul Sipligunj: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్లే బాక్స్ సింగర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన వారిలో ఒకరు రాహుల్ సిప్లిగంజ్.. ఆ తర్వాత తన టాలెంట్ తో ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. ముఖ్యంగా ఈయన పాడిన పాటలల్లో నాటు నాటు పాట మంచి క్రేజ్ ను అందించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరికెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీలోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు వరించింది.. దాంతో ఒక్కసారిగా ఈ సింగరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. సింగర్ గా తన కెరీర్ని కొనసాగిస్తూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ వస్తున్నాడు రాహుల్.. అయితే ఈమధ్య ఈయన పలువురితో ప్రేమాయణం నడిపాడు అంటూ వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సైలెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఫోటోలు కూడా పెద్దగా బయటికి రాలేదు..
సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్..
టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నాటు నాటు పాటతో ఒక్కసారిగా స్టార్ ఈ హీరోను మించి ఇమేజ్ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను తన పాటలతో అలరిస్తున్నారు.. ఇదిలా ఉండగా.. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఈయన ప్రేమ వ్యవహారాలపై పలు రకాల వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో ఆయనకు తన ఎంగేజ్మెంట్ విషయాన్ని బయట పెట్టకుండా సైలెంట్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే తన ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత ఫేమస్ సింగరు ఇలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి దీనిపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి..
Also Read: ‘పెద్ది ‘ సాలిడ్ అప్డేట్.. గ్లోబల్ స్టార్ క్రేజీ లుక్..ఫ్యాన్స్ కు పండగే..
రాహుల్ కాబోయే భార్య ఎవరంటే..?
గతంలో ఈయన కొందరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్లు ఆ మధ్య వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అందులో బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ తో దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అందుకేనేమో సైలెంట్ గా నిశ్చితార్థం కానిచ్చేసాడు. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని అమ్మాయిని తన కుటుంబ సభ్యులు చూసినట్లు తెలుస్తుంది. ఆమె పేరు హరిణి రెడ్డి.. నిన్న అతి కొద్దిమంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దీని గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక కెరీర్ విషయానికొస్తే..రాహుల్ సిప్లిగంజ్ ఈమధ్య వరుసగా సినీ అవకాశాలను అందుకుంటూ తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఇన్నాళ్లకు ఓ ఇంటివాడు కాబోతున్నందుకు ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.. త్వరలోనే ఈయన తన పెళ్లి గురించి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.