BigTV English

Kitchen Tasks Before Vacation: సమ్మర్ వెకేషన్‌కు వెళుతున్నారా?.. ఇంటి కిచెన్‌లో ఈ పనులు చేసి వెళ్లండి

Kitchen Tasks Before Vacation: సమ్మర్ వెకేషన్‌కు వెళుతున్నారా?.. ఇంటి కిచెన్‌లో ఈ పనులు చేసి వెళ్లండి

Kitchen Tasks Before Vacation| అందరూ వేసవి కాలం వచ్చిందంటే చాలు పర్యాటక ప్రాంతాలకు లేదా స్వగ్రామాలకు కొంతకాలం వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం కొన్ని రోజుల ముందే ప్లానింగ్ చేసుకుంటారు. ప్రయాణాల కోసం ట్రైన్ టికెట్లు వారాలు, నెలల ముందే బుకింగ్ చేసుకుంటారు. ఆ తరువాత పచ్చని ప్రదేశాలు కొండ ప్రాంతాలకు వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇదంతా ప్లాన్ చేసే క్రమంలో ఒక్కటి మాత్రం మరిచిపోతుంటారు అదే ఇంటి కిచెన్ మొత్తం క్లిన్ చేయడం లేదా సర్ది వెళ్లడం.


కిచెన్ లో పాడైపోయిన ఆహారం, దాంతో వచ్చే దర్వాసన వల్ల కాక్రోచ్ లు దోమలు ఎక్కువైతాయి. వెకేషన్ నుంచి వచ్చాక అది చూస్తే.. అసలు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిన మూడ్ అంతా పోతుంది. అందుకే ముందు చూపుతో అంతా ప్లానింగ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు వెకేషన్ నుంచి వచ్చాక కూడా మీ కిచెన్ ఫ్రెష్ గా, క్లీన్ గా ఉంటుంది.

వెకేషన్ కు వెళ్లే ముందు కిచెన్ లో పూర్తి చేయాల్సిన పనులు
1.ఫ్రిజ్ లో నుంచి అన్నీ తొలగించాలి
నెల రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లే ముందు ఫ్రిజ్ లో ఉన్నవి అంతా తొలగించాలి. లేకపోతే వచ్చిన తరువాత ఫ్రిజ్ లో అంతా రోతగా ఉంటుంది. ఫ్రిజ్ లోని అన్ని షెల్ఫ్‌లు బాగా చెక్ చేసి కుళ్లిపోయే ప్రతీ పదార్థం తొలగించాలి. తరగిన కూరగాయలు, పండ్లు, వండి పెట్టిన ఆహారం, మిగిలిపోయిన వంటకాలు, పాలు, పాల ఉత్పత్తులు. ప్యాక్ చేసిన ఉన్న ప్రతి ఉత్పత్తి ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేసి దాంతో ఉపయోగం లేదని పిస్తే వెంటనే పారేయండి. ఏదైనా వంటకాలు, కూరలు.. ఫ్రిజ్ లో ఒలకి పడినా వాటిని శుభ్రం చేయండి. ఫ్రిజ్ లో ఒక ఖాళీ కంటెయినర్ పెట్టి అందులో కొంచెం సోడా కూడా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఫ్రిజ్ లో ఏదైనా దుర్వాసన ఉంటే బేకింగ్ సోడా దాన్ని పీల్చుకుంటుంది.


2.కిచెన్ లోని రేషన్‌ని క్రమంలో పెట్టండి
కిచెన్ లో ఉండే రేషన్ తెరచి ఉంటే వల్ల కాక్రోచ్ లు వచ్చేస్తాయి. బియ్యం, గోధుమ పిండి, ఏదైనా స్నాక్స్ లాంటివి తెరచి ఉంటే వాటిలోకి చీమలు, కాక్రోచ్ లు చేరుతాయి. అందుకే తెరచి ఉన్న రేషన్ ఐటెమ్స్ ని ఎయిర్ టైట్ కంటెయినర్లు లేదా క్లిప్ బ్యాగుల్లో పెట్టాలి. వీటిలో కూడా ఏదైనా పాడైపోయిన, కాక్రోచ్ లు చేరిన, ఎక్స్‌పైరీ అయి పోయిన ఐటెమ్స్ ని పారేయండి. ఏదైనా మిగిలిపోయిన బ్రెడ్, బిస్కెట్లు ఉంటే వంట గది మూలల్లో ఉంటే వాటిని బాగా శుభ్రం చేయండి. పైగా వెకేషన్ వెళ్లే కొన్ని రోజుల ముందు రేషన్ తక్కువగా స్టాక్ చేసుకోవాలి.

3.కిచెన్ ఎలెక్ట్రానిక్ అప్లయన్సులు కనెక్షన్ తొలగించాలి

కిచెన్ లో ఎలెక్ట్రానిక్ అప్లయన్సులు ఉంటే వాటిని ప్లగ్ నుంచి తొలగించాలి. ఇలా చేయడం చాలా అవసరం. కిచెన్ లో మిక్సీ, టోస్టర్, బ్లెండర్, ఎయిర్ ఫ్రైయర్ లాంటివి స్విచాఫ్ చేసి వాటిని కరెంట్ బోర్డ్ నుంచి కనెక్షన్ లేకుండా తొలగించాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా షార్ట్ సర్కూట్ ప్రమాదం జరగకుండా నివారించవచ్చు. దీంతో మీ కిచెన్ ఎలెక్ట్రానిక్స్ ఉపకరణాలు కూడా భద్రంగా ఉంటాయి. ఇలా చేస్తే వెకేషన్ నుంచి వచ్చాక.. వంటగదిలో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి.

4.కిచెన్ లో నుంచి చెత్త మొత్తం తొలగించాలి
వెకేషన్ కు వెళ్లే ముందు వంటగదిలోని చెత్త కుండీ లో ఏ మాత్రం వ్యర్థాలు లేకుండా పూర్తిగా ఖాళీ చేయాలి. వంటగదిలో వాడేసిన టీ బ్యాగులు, చెత్త ఉంటే అదంతా కుళ్లిపోయి ఆ దుర్వాసన ఇల్లు మొత్తం వ్యాపిస్తుంది. ముఖ్యంగా వేసవి, వర్షకాలంలో. అందుకే చెత్తకుండీలు ఖాళీ చేసి, కిచెన్ సింక్ దాని చుట్టూ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. ఆ పైన చెత్త కుండీ, సింక్ బాగా కడిగేయండి. వీలైతే చెత్త కుండీలను ఒక గార్బేజ్ బ్యాగులో పెట్టి వెళ్లండి.

5.కిచెన్ సింక్ లో ఏదీ పెట్టకూడదు
వంటగదిలో సింక్ శుభ్రంగా లేకపోతే ఇన్‌ఫెక్షన్ సమస్యలొస్తాయి. కిచెన్ లో అశుభ్రంగా ఉండే టీ కప్పుతో సహా వంటపాత్రల ఏవి ఉన్నా.. వాటిని వాయిదా వేయకుండా శుభ్రంగా కడిగేయండి. సింక్ ని కూడా నిమ్మరసం కలిపిన వేడినీటితో శుభ్రం చేస్తే ఫ్రెష్ గా సువాసన వెదజల్లుతోంది. కిచెన్ కౌంటర్లు, స్టవ్, మైక్రోవేవ్ లాంటి అన్ని శుభ్రం చేసి నిశ్చింతగా వెకేషన్ కు వెళ్లండి. లేదంటా కిచెన్ కౌంటర్ పై ఉన్న మసాలా, ఆయిల్ మరకలు కాక్రోచ్లను ఆహ్వానం పలుకుతాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×