Diabetes Control: ప్రస్తుతం కాలంలో డయాబెటిస్ అత్యంత తీవ్రమైన వ్యాధులలో ఒకటి. పెరుగుతున్న ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు , బిజీ లైఫ్ స్టైల్ దీనికి ప్రధాన కారణాలు. శరీరంలో ఇన్సులిన్ పరిమాణం అసమతుల్యమైనప్పుడు.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే.. అది కళ్ళు, మూత్రపిండాలు, గుండె, నరాలకు హాని కలిగిస్తుంది.
కొన్ని టిప్స్ పాటించడం ద్వారా రక్తంలో చక్కెరను సహజంగా నియంత్రించవచ్చు. మీరు మందులపై మాత్రమే ఆధారపడవలసిన అవసరం లేదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన లైప్ స్టైల్ ద్వారా కూడా చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచుకోవచ్చు.
రక్తంలో చక్కెరను నియంత్రించడానికి 5 మార్గాలు
సమతుల్య, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
మీ ఆహారంలో ఓట్స్, చియా గింజలు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు వంటి పీచు పదార్ధాలను చేర్చుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అంతే కాకుండా ఆకస్మిక చక్కెర స్పైక్‌లను నివారిస్తాయి. అలాగే తెల్ల రొట్టె, స్వీట్లు , ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండటం మంచిది.
క్రమం తప్పకుండా వ్యాయామం:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం చాలా మంచిది. అది నడక, యోగా లేదా సైక్లింగ్ ఏదైనా కావచ్చు. వ్యాయామం శరీర ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంతే కాకుండా ఇది గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు ముఖ్యమైనది.
ఒత్తిడిని తగ్గించండి:
ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ధ్యానం, = లోతైన శ్వాస వ్యాయామాలు , సంగీతం వినడం లేదా పుస్తకం చదవడం, ఈ పద్ధతులన్నీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మంచి నిద్ర కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.
Also Read: పాలకూర తింటే ఇన్ని లాభాలా ? ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
నీళ్లు బాగా తాగండి:
రోజంతా తగినంత నీరు త్రాగడం ద్వారా.. శరీరంలో పేరుకుపోయిన అదనపు చక్కెర మూత్రం ద్వారా తొలగించబడుతుంది. దీనితో పాటు.. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తియ్యటి డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్‌కు బదులుగా సాధారణ నీరు లేదా నిమ్మరసం తాగడానికి ప్రయత్నించండి.
చక్కెర స్ధాయి చెక్ చేయండి:
మీ చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చెక్ చేస్తూ ఉండండి. తద్వారా మీరు సకాలంలో సమాచారాన్ని కూడా పొందుతారు. దీంతో మీరు మీ చక్కెర స్థాయిని ఏవి పెంచుతున్నాయో లేదా తగ్గిస్తున్నాయో తెలుసుకోగలుగుతారు. అలాగే..డాక్టర్ సలహాతో ఆహారం లేదా మందులలో అవసరమైన మార్పులు చేయడం సులభం.