BigTV English

Dasara Recipes: ఈ రెసిపీలను దసరా రోజు తప్పక ట్రై చేయండి

Dasara Recipes: ఈ రెసిపీలను దసరా రోజు తప్పక ట్రై చేయండి

Dasara Recipes: దసరాను దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. దసరా పండగ రోజు దుర్గాదేవికి కొన్ని రకాల నైవేద్యాలను తయారు చేసి సమర్పించవచ్చు. నవరాత్రులలో ఉపవాసం ఉన్న వారు ప్రత్యేక మైన పదార్థాలతో సాంప్రదాయ వంటకాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించవచ్చు.


దద్దోజనం:

కావాల్సన పదార్థాలు..
బియ్యం – 1 కప్పు
నీరు- రెండున్నర కప్పు
పాలు- ఒకటిన్నర కప్పు
పెరుగు- 2 కప్పులు
ఉప్పు- రుచికి తగినంత


తాళింపు కోసం..
నూనె- 2 టేబుల్ స్పూన్లు
పచ్చి శనగపప్పు- 1 టీ స్పూన్
మినప పప్పు-1 టీ స్పూన్
ఆవాలు- అరటీ స్పూన్
జీలకర్ర- అర టీ స్పూన్
మిరియాలు- అర టీ స్పూన్
అల్లం తరుము- 2 టీ స్పూన్
పచ్చిమిర్చి – 4
ఎండు మిర్చి – 2
కరివేపాకు- ఒక రెబ్బ
ఇంగువ – చిటికెడు

తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి నానపెట్టుకోవాలి. తర్వాత వాటిని గిన్నెలో వేసి కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు వేసుకోవాలి. ఈ లోపు స్టౌ వెలిగించి గిన్నెలో పాలు వేసి కాగనియ్యాలి. అన్నం ఉడికిన తర్వాత కాచిన పాలు వేసి కలపాలి. అన్నం ముద్దలు కాకుండా కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు ఫ్రెష్ అయితే దద్దోజనం బాగుంటుంది. తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకొని కలుపుకోవాలి. అంతే దద్దోజనం రెడీ అవుతుంది.

బెల్లం పాయసం:

కావాల్సిన పదార్థాలు..
బియ్యం – 2 కప్పులు
బెల్లం- రుచికి సరిపడా
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము – 4 చెంచాలు
బాదం పప్పు- తగినంత
జీడిపప్పు- తగినంత
కర్బూజా గింజలు- తగినంత
ఎండు ద్రాక్ష- తగినంత

తయారీ విధానం: ముందుగా బాణలిలో బియ్యం ఉడికించాలి. బియ్యం 80 శాతం ఉడికిన తర్వాత బెల్లం తురుము, కొబ్బరి తురుముతో పాటు నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత పైన చెప్పిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని అన్నం మగ్గిన తర్వాత దింపేయాలి. అంతే సింపుల్ గా తక్కువ సమయంలో బెల్లం పాయసం రెడీ అవుతుంది.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×