BigTV English

Pooja Hegde : బుట్టబొమ్మ మామూలుది కాదు… ఈ చిన్న స్ట్రాటజీ తో నిర్మాతలను బుట్టలో వేసుకుందా?

Pooja Hegde : బుట్టబొమ్మ మామూలుది కాదు… ఈ చిన్న స్ట్రాటజీ తో నిర్మాతలను బుట్టలో వేసుకుందా?

Pooja Hegde : మంగళూరు భామ పూజ హెగ్డే టాలీవుడ్లో బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఈ హీరోయిన్ కు అవకాశాలు కరువయ్యాయి. కానీ సడన్ గా తమిళ మేకర్స్ పూజ హెగ్డే ని పిలిచి మరీ అవకాశాల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ కథంతా జరగడానికంటే ముందు పూజ హెగ్డే ఓ చిన్న స్ట్రాటజీని ప్లే చేసి నిర్మాతలను బుట్టలో వేసుకుని తెలుస్తోంది. మరి ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం పదండి.


సింపుల్ స్ట్రాటజీతో అవకాశాల వెల్లువ

అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే కి ఆ తర్వాత వరుస డిజాస్టర్స్ కారణంగా అవకాశాలే లేకుండా పోయాయి. ముఖ్యంగా టాలీవుడ్ మేకర్స్ పూజ హెగ్డే కి అందనంత దూరంలో ఉండిపోయారు. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది. కానీ అక్కడ కూడా లక్ వెన్ను చూపడంతో చేసేదేమిలేక సైలెంట్ అయిపోయింది బుట్ట బొమ్మ. ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే కెరియర్ పూర్తయినట్టేనని అందరూ భావించారు. చేతిలో ఒక్క సినిమా కూడా లేక అల్లాడుతూ ఉందని, అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని రూమర్స్ వినిపించాయి. అయితే అనుకోకుండా ఇటీవల కాలంలో కోలీవుడ్ నుంచి బుట్ట బొమ్మ ఖాతాలో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే ఆమె ప్రయత్నాల ఫలితం సంగతి దేవుడెరుగు గానీ పూజా ప్లే చేసిన ఒక స్ట్రాటజీ వల్లే నిర్మాతలు తన వెంట పడుతున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాతలంతా ఇలా తన బుట్టలో పడేలా బుట్ట బొమ్మ చేసిన మ్యాజిక్ మరేదో కాదు పారితోషికాన్ని తగ్గించుకోవడం.


గతంలో భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ నిర్మాతలను ఆకర్షిస్తుందట. అందుకే కోలీవుడ్ నుంచి మంగళూరు బ్యూటీ కి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయని టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే తాజాగా విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ వరించిందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు గతంలో ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందినప్పుడు తీసుకున్న పారితోషకం కంటే చాలా తక్కువ పారితోషకం తీసుకుంటుందట. అయితే ఆ సంఖ్య ఎంత అన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు.

బుట్ట బొమ్మకు వరుస అవకాశాలు

రీసెంట్ గా దళపతి విజయ్ చివరి సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోందనే ప్రకటన అందరినీ  ఆశ్చర్యపరిచింది. ఇక పూజా హెగ్డే సైతం ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అయితే విజయ్ కంటే ముందే పూజ హెగ్డే తమిళంలో హీరో సూర్య సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. సూర్య 44వ సినిమాలో ఈ బ్యూటీనే కథానాయికగా చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఎలాగైనా సరే తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని, ఎప్పటిలాగే తెలుగులో అవకాశాలను తెచ్చి పెడతాయని ఆశిస్తుంది పూజా హెగ్డే. మరి బుట్ట బొమ్మ కలలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే తమిళంలో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సీ.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×