BigTV English

Skin Care: ముఖంతో పోలిస్తే.. మీ చేతులు, కాళ్లు నల్లగా ఉన్నాయా ?

Skin Care: ముఖంతో పోలిస్తే.. మీ చేతులు, కాళ్లు నల్లగా ఉన్నాయా ?

Skin Care: సాధారణంగా మన ముఖం ఉన్న రంగును చేతులు , కాళ్లు కలిగి ఉండవు. ట్యాన్ కారణంగా ఫేస్‌తో పోలిస్తే.. ముఖం, కాళ్ల రంగు నల్లగా మారుతుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా చలికాలంలో చేతులు నల్లబడటం అనేది ఒక సాధారణ సమస్య. మీరు ఈ సమస్యను వదిలించుకోవాలనుకుంటే కొన్ని రకాల టిప్స్ పాటించడం అవసరం.


చలికాలం ప్రారంభమైన వెంటనే, దాని ప్రభావం ప్రజల చర్మంపై కనిపించడం ప్రారంభమవుతుంది. చల్లని గాలుల కారణంగా, చర్మం చాలా పొడిగా మారుతుంది.అంతే కాకుండా చనిపోయిన చర్మం దానిపై పేరుకుపోతుంది. ఈ డెడ్ స్కిన్ వల్ల చర్మం చాలా నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనం చేతులు, కాళ్ళ గురించి మాట్లాడినట్లయితే, ఈ సీజన్‌లో చేతులు , కాళ్ళు ఆటోమేటిక్‌గా నల్లగా మారుతుంటాయి.

ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని రకాల టిప్స్ ట్రై చేయడం మంచిది. ఈ రెమెడీస్‌ని వాడటం ద్వారా చేతులు, కాళ్లపై ఉన్న నల్లదనాన్ని తొలగించుకోవచ్చు. హోం రెమెడీస్ ఉపయోగించే ముందు మీ చర్మం రకంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. అలెర్జీ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.


ఈ సీజన్‌లో చల్లటి గాలులు తరచుగా వీస్తాయి. అందుకే చర్మం పొడిగా మారడం చాలా సాధారణం. ఇలా చర్మం పొడిబారడం వల్ల చేతులు, కాళ్లు నల్లగా మారతాయి. అటువంటి పరిస్థితిలో, మీ చేతులను మృదువుగా మరియు మెరిసేలా ఉంచడానికి చేతులకు మాయిశ్చరైజర్‌ను రోజుకు 2- 3 సార్లు ఉపయోగించండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా చల్లని గాలి నుండి కాపాడుతుంది.

స్క్రబ్:

చలికాలంలో చేతులపై మృతకణాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. వాటిని తొలగించడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు స్క్రబ్ ఉపయోగించవచ్చు. స్క్రబ్ తయారు చేయడానికి, ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ నూనె మిక్స్ చేసి మీ చేతులకు స్క్రబ్ చేయండి.

స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా నల్ల మచ్చలను కాంతివంతం చేస్తుంది. చలికాలంలో మీ చేతులు పొడిబారినట్లు అనిపించినప్పుడల్లా, అలోవెరా జెల్ ఉపయోగించండి.

Also Read: ఇలా చేస్తే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

ఆరెంజ్‌:

ఈ సీజన్‌లో చాలా ఆరెంజ్‌లు మార్కెట్‌లో లభిస్తాయి. నారింజ తొక్క చర్మాన్ని కాంతివంతం చేయడంలో, మృత కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, దాని పొడిని తయారు చేసి, పాలలో కలిపి ప్యాక్ సిద్ధం చేయండి. దీన్ని చేతులకు, లేదా కాళ్లకు అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.

నిమ్మరసం,తేనె:
నిమ్మకాయలో చర్మాన్ని కాంతివంతం చేసే గుణాలు ఉన్నాయి. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ రెమెడీ చేతులను, కాళ్లను కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×