BigTV English
Advertisement

Pawan Kalyan vs Dwarampudi: పవన్ దెబ్బ.. కాకినాడ కి ద్వారంపూడి గుడ్ బై..?

Pawan Kalyan vs Dwarampudi: పవన్ దెబ్బ.. కాకినాడ కి  ద్వారంపూడి గుడ్ బై..?

Pawan Kalyan vs Dwarampudi: వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యధేచ్చగా కొనసాగాయన్న ఆరోపణలున్నాయి. ఎర్రచందనం దగ్గర నుంచి క్వార్ట్‌జ్ స్మగ్లర్ల వరకు విచ్చలవిడిగా చెలరేగిపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వం మారినా ఆ స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అధికారంలోకి రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరడా ఝలిపించారు. పవన్‌కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలోనే కాకినాడ ఫోర్టులో అక్రమాలు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడాయనే స్వయంగా బరిలోకి దిగడంతో ఇక ద్వారంపూడి దందాలకు చెక్ పడినట్లే అంటున్నారు.


ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు.. ఒకప్పుడు కాకినాడ. ఆయన అడ్డా. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అతని హవా నడిచింది. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎప్పుడైతే ఆ నేత తలరాతను మార్చేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రతిజ్ఞ చేశారో అక్కడ నుంచి సీన్‌ మారింది. వైసీపీ ఘోరఓటమి తర్వాత వరుసగా వస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంట. ఉన్న కేసుల మెడ చుట్టూ బిగుసుకుంటుంటే.. కనీసం అధిష్టానం కూడా పట్టించుకోకపోవటం మరింత కుంగదీసే అంశంగా మారిందంట.

వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టును బేస్ చేసుకుని ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.. ఆ క్రమంలో కాకినాడ ఫోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రావాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కాకినాడలో ద్వారంపూడి తన పతనాన్ని తానే రాసుకున్నారని రాజకీయనిపుణులు అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంతో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జనసైనికులపైనా దాడులు చేయించారనే వార్తలు వినిపించాయి.


అంతేకాదు.. ఓ అడుగు ముందుకేసిన ఆ మాజీ ఎమ్మెల్యే.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతామని చాలెంజ్ చేశారు. ముద్రగడ పద్మానభంతో కలిసి పిఠాపురంలో జనసేనానిని ఓడించడానికి సర్వ శక్తులు ఒడ్డారు. పవన్‌ని సామాజికవర్గం పరంగా, పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ నానా హడావుడి చేశారు. ఆ క్రమంలో మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తీరుపై పవన్‌కల్యాణ్‌ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్‌.. ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ద్వారంపూడి అధ:పాతాళానికి తొక్కేస్తానని.. లేకుండా పేరు మార్చుకుంటానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ద్వారంపూడి ఇష్టానుసారం చెలరేగిపోయారు. తీరా చూస్తే ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది కూటమి ఘన విజయం సాధిస్తే.. జగన్ పార్టీ కనీసం విపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అత్యంత అవమానకర రీతిలో 175 స్ధానాలకు గానూ కేవలం 11 స్థానాలలోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ నుంచి ద్వారం పడి చంద్రశేఖరరెడ్డి ఘోర పరాజయాన్ని చవి చూశారు.

Also Read:  నాదెళ్ల సీజ్ చేసిన బియ్యం పోర్ట్‌కి ఎలా వచ్చాయి? కాకినాడ మాఫియాకు లీడర్ అతనే!

కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమరవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్నీ సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫీయా కొంత కాలం సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది ఓపెన్ సీక్రెట్టే.

జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లే వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన ద్వారం పూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమౌతోంది. ఇటీవల వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడ పట్టుబడింది.

ఆ క్రమంలో కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్‌ పర్యటించారు. యాంకరేజ్‌ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. అందులో పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించారు. నేరుగా పవన్‌ బార్జి ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్‌ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్‌వో, కలెక్టర్‌, పోర్టు అధికారి, ఇతర అధి కారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్‌ మాఫి యాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని శివాలెత్తారు. ఉద్యోగాలు చేస్తున్నారా.. మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ మండిపడ్డారు. తర్వాత అక్కడినుంచి డీప్‌వాటర్‌ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్‌ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు.

ఆయన టగ్‌ ఎక్కి తొమ్మిది నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న పశ్చి మ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్‌ పనామా వద్దకు బయ లుదేరారు.నౌకవద్దకు వెళ్లిన తర్వాత పైకి ఎక్కి ఎగు మతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పరి శీలించారు. ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్‌ మాఫియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహ నం వ్యక్తంచేశారు. మొత్తమ్మీద ఇప్పుడు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అవినీతి ద్వారంపూడి ఆటకట్టినట్లేనని అంటున్నారు.

బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి, ఇక కేంద్రం అధీనంలోని పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండల ఆటకట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులనూ వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారలు అండదండలు, సహాయసహకారాలూ లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం దూకుడుతో కాకినాడతో ద్వారంపూడికి రుణానుబంధం తీరిపోయినట్లేనని.. ఆ మాజీ ఎమ్మెల్యే అక్రమ దందాలకు పూర్తిగా చెక్ పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Related News

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×