Tamannah : ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ఎలా ఉంది అంటే… తమన్నా అంటే ఐటమ్ సాంగ్, ఐటెం సాంగ్ అంటే తమన్నా అన్నట్టుగా మారింది పరిస్థితి. రీసెంట్ గా ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ దుమ్ము రేపాయి. దీంతో తెరపైకి ఏమైనా బిగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే చాలు తమన్నా (Tamannaah) చిందేస్తే అదిరిపోతుంది అన్న అభిప్రాయంలో ఉన్నారు మేకర్స్, అలాగే ప్రేక్షకులు కూడా. ఈ నేపథ్యంలోనే తమన్నా స్పందిస్తూ, ఈ విషయం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తను ఐటెం సాంగ్ లో నటించిన సినిమాలు సక్సెస్ అవడం ఒకపక్క ఆనందంగానే ఉన్నా, దర్శక నిర్మాతలు వరుసగా ఐటమ్ సాంగ్లే చేయమంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేసింది తమన్నా. సూపర్ స్టార్ రజనీ సర్ అంటే అభిమానంతోనే ‘జైలర్’ సినిమా చేశానని, అమర్ కౌశిక్ మంచి ఫ్రెండ్ కావడంతో ‘స్త్రీ 2’ సినిమాలో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పానని తెలియజేసింది. వరుసగా ఇలా ఐటెం సాంగ్ లు చేయడానికి నేను ఐటెం గర్ల్ కాదని మీడియాతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatiya).
అయితే తమన్నా ‘జైలర్’ సినిమాలో ‘వా… కావాలయ్యా’ అంటూ చిందులు వేసి కుర్రకారుని ఒక ఊపు ఊపింది. ‘జైలర్’ (Jailer) సినిమాకి రజిని నటనతో పాటు తమన్న ఐటమ్ సాంగ్ కూడా తోడవడంతో మూవీ దూసుకుపోయింది. ఆ తర్వాత అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన ‘స్త్రీ 2’ సినిమాలో కూడా ‘ఆజ్ కి రాత్’ అంటూ చెలరేగిపోయింది. ఇలా మిల్కీ బ్యూటీ ఐటమ్ సాంగ్ లకు, తన అందాన్ని జోడించి అభిమానులకు నిద్ర పట్టకుండా చేసింది. దీనిని క్యాష్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు తమన్నాతో ఐటం సాంగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు.
13 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatiya). అయితే ప్రస్తుతం తమన్న కి సౌత్ లో అవకాశాలు తగ్గాయి. ‘జైలర్’ సినిమానే ఆమె చివరి మూవీ. పైగా అందులోనూ ఐటం సాంగ్ చేసింది. ప్రస్తుతానికి ఆమె దగ్గర కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు.
మరోవైపు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలాకాలంగా డేటింగ్ లో ఉన్న తమన్నా, అతనితో పెళ్లి పీటలు ఎక్కబోతోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి గురించి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే గుసగుసలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన ‘సికందర్ కా ముఖద్దర్’ (Sikandar Ka Muqaddar) చిత్రం ఓటీటీలో నవంబర్ 29న విడుదలైంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జిమ్మీ షెర్గిల్, తమన్నా భాటియా, అవినాష్ తివారీ ఈ చిత్రంలో నటించారు.