BigTV English

Neck Pain: మెడ నొప్పి తగ్గాలంటే .. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Neck Pain: మెడ నొప్పి తగ్గాలంటే .. ఎలాంటి టిప్స్ పాటించాలి ?
Advertisement

Neck Pain: మెడ నొప్పి అనేది చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. ప్రస్తుత జీవనశైలి, గంటల తరబడి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు వాడటం, సరైన పోస్టర్ పాటించకపోవడం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మెడ కండరాలు ఒత్తిడికి లోనై నొప్పి వస్తుంది. తేలికపాటి మెడ నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు తప్పకుండా పాటించాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. వేడి, చల్లటి కాపడం:
ఐస్ ప్యాక్: నొప్పి ప్రారంభమైన మొదటి 24-48 గంటల్లో ఐస్ ప్యాక్ వాడటం మంచిది. ఐస్ ప్యాక్ వల్ల మెడ, భుజాల వద్ద వాపు తగ్గుతుంది. అంతే కాకుండా రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఐస్ క్యూబ్స్‌ను శుభ్రమైన క్లాత్ చుట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో సుమారు 10-15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

హాట్ ప్యాక్: 48 గంటల తర్వాత.. లేదా కండరాలు పట్టేసినట్లుగా అనిపిస్తే.. వేడి కాపడం పెట్టాలి. వేడినీటిలో శుభ్రమైన బట్టను ముంచి, నీరు పిండి, మెడపై సుమారు 10-15 నిమిషాలు ఉంచాలి. వేడి నీటితో స్నానం చేయడం లేదా వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల మెడ కండరాలు మెత్తబడి.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా వాపు తగ్గుతుంది.


2. నూనెతో మర్దన :

కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా బాదం నూనె వంటి వాటిని కొద్దిగా గోరు వెచ్చగా చేసి.. నొప్పి ఉన్న ప్రదేశంలో మృదువుగా మర్దన చేయడం వల్ల కండరాలు శాంతించి.. నొప్పి, వాపు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు మర్దన చేస్తే మంచి ప్రభావం ఉంటుంది.

3. విశ్రాంతి :

మెడ నొప్పి ఉన్నప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. విపరీతంగా పని చేయడం లేదా మెడకు ఒత్తిడి కలిగించే పనులు చేయకుండా ఉండాలి.

4. సరైన ఫోన్:

మెడ నొప్పికి ప్రధాన కారణాలలో సరైన భంగిమ లేకపోవడం ఒకటి.

కూర్చునేటప్పుడు.. నిల్చునేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచాలి.

కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు స్క్రీన్ కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువసేపు మెడను వంచి చూడటం మానుకోవాలి.

5. తేలికపాటి వ్యాయామాలు:

నొప్పి మరీ ఎక్కువగా లేనప్పుడు.. మెడను నెమ్మదిగా కదిలించడం, వంచడం, సున్నితంగా చుట్టేసేలా కదలికలు చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ వ్యాయామాలను ఎటువంటి ఒత్తిడి లేకుండా.. నెమ్మదిగా చేయాలి. నొప్పి తీవ్రమైతే వెంటనే ఆపాలి.

6. సరైన నిద్ర విధానం:

ఎత్తైన దిండును వాడటం మానుకోవాలి. మెడ, వెన్నెముక ఒకే సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి.

మెత్తగా ఉండే దిండును వాడటం మంచిది. కనీసం 8 గంటలు కంటినిండా నిద్రపోవాలి.

Also Read: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయ్ !

7. ఒత్తిడి నిర్వహణ:

ఒత్తిడి కారణంగా కూడా మెడ కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా యోగా వంటి పద్ధతులను పాటించడం వల్ల ఉద్రిక్త కండరాలు సడలి.. నొప్పి తగ్గుతుంది.

తేలికపాటి మెడ నొప్పికి ఈ ఇంటి చిట్కాలు సహాయపడతాయి. అయితే.. నొప్పి తీవ్రంగా ఉంటే.. కొన్ని రోజుల్లో తగ్గకపోతే, లేదా జ్వరం, బరువు తగ్గడం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

Related News

Boiled Peanuts Benefits: ఉడకబెట్టిన వేరుశనగలు తింటున్నారా? మీ ఆరోగ్యం ఇలా మారిపోతుంది..

Heart Attack: గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించే.. అలవాట్లు ఏంటో తెలుసా ?

Jeera water vs Chia seeds: జీరా వాటర్, చియా సీడ్స్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటే?

Beauty Secret: అమ్మాయిలు ఈ సీక్రెట్ మీకోసమే.. ఇది తింటే మెరిసే చర్మం మీ సొంతం

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయ్ !

Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా కూడా వాడొచ్చా? ఇన్నాళ్లు తేలియలేదే ?

Karpooram: చిటికెడు పచ్చ కర్పూరం.. జీర్ణ సమస్యల నుండి కీళ్ల నొప్పుల వరకు ఉపశమనం

Big Stories

×