చాలా మంది బరువు తగ్గేందుకు జిమ్ కు వెళ్తుంటారు. కానీ, అంత టైమ్ లేని వాళ్లు వంటింట్లోని వస్తువులను ట్రై చేస్తుంటారు. బరువును చక్కగా అదుపు చేసేందుకు జీరా వాటర్, చియా సీడ్స్ వాటర్ చక్కగా పని చేస్తాయి. జీవక్రియను పెంచడానికి, జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఈ డ్రింక్స్ ను చాలా మంది వైద్య నిపుణులు సిఫార్స్ చేస్తారు. కానీ, ఎక్కువ బరువు తగ్గేందుకు వీటలో ఏది ఎఫెక్టివ్ గా పని చేస్తుందంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ జీలకర్ర
❂యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
❂జీర్ణక్రియను చక్కగా మెయింటెయిన్ చేస్తుంది.
❂తక్కువ కేలరీలు ఉంటాయి.
⦿ చియా సీడ్స్
❂ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
❂కాల్షియం, మెగ్నీషియం,యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
❂నానబెట్టినప్పుడు అన్నంలా తయారై కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
⦿ జీరా వాటర్
❂సహజంగా జీవక్రియను పెంచుతుంది.
❂ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
❂రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
⦿ చియా సీడ్స్
❂అధిక ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది.చిరుతిండిని తగ్గిస్తుంది.
❂బరువు తగ్గే సమయంలో ప్రోటీన్ కంటెంట్ కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది.
❂ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
❂జీరా వాటర్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచిది.
❂చియా విత్తనాల నీరు ఉదయం మధ్యలో లేదంటే భోజనానికి ముందు తీసుకోవడం మంచిది.
Read Also: మత్తెక్కించే మాటలతో మాయ చేయనున్న చాట్ జిపిటి.. ఇక ఆటగాళ్లకు పండగే!
జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరుచుకోవాలంటే, జీరా నీరు త్వరగా ప్రభావం చూపుతుంది. కానీ, దీర్ఘకాలిక బరువు నిర్వహణ కోసం చూస్తున్నట్లయితే, చియా సీడ్స్ వాటర్, దాని అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కారణంగా మెరుగైన ఫలితాలను అందిస్తుంది. జీరా, చియా సీడ్స్ వాటర్ రెండూ ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వేగవంతమైన జీవక్రియ పెరుగుదల కోసం జీరా నీటితో రోజును ప్రారంభించడం మంచిది. కడుపు నిండిన భావన, ఆకలి నియంత్రణ కోసం చియా సీడ్స్ నీటిని తీసుకోవడం ఉత్తమం. రెండింటినీ రెగ్యుల్ గా తీసుకోవడం వల్ల చక్కగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం రెగ్యులర్ గా ఈ డ్రింక్స్ తీసుకోవడం మొదలుపెట్టండి.
Read Also: ఎల్లో వాటర్ మిలన్.. తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?