Coconut Oil : కొబ్బరి నూనె అనేది వంటగదికి మాత్రమే పరిమిత కాలేదు. తరతరాలుగా.. దీనిని సౌందర్య పోషణల.. అనేక ఆరోగ్య సమస్యలకు సహజ నివారణిగా కూడా ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ , ముఖ్యంగా లారిక్ యాసిడ్, యాంటీమైక్రోబియల్ , యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవే దీనిని ఒక శక్తివంతమైన ఔషధంగా మారుస్తాయి.
ప్రయోజనాలు:
1. చర్మ సంరక్షణ:
సహజ మాయిశ్చరైజర్: కొబ్బరి నూనె చర్మానికి అద్భుతమైన తేమను అందిస్తుంది. దీనిని ప్రతి రోజు శరీరానికి.. ముఖ్యంగా పొడిబారిన మోచేతులు, పాదాలకు అప్లై చేయడ్డం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. ఫలితంగా తేమ బయటకు పోకుండా కాపాడుతుంది.
తామర, దురద నివారణ: కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తామర, దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయ పడతాయి. ఇది చర్మపు ఎరుపుదలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని శాంత పరుస్తుంది.
మేకప్ రిమూవర్: కళ్ళ చుట్టూ ఉన్న సున్నితమైన మేకప్‌ను తొలగించడానికి కొబ్బరి నూనె సురక్షితమైన. ప్రభావవంతమైన మార్గం. కొద్ది మొత్తంలో నూనెను తీసుకుని మసాజ్ చేసి.. దూదితో తుడిచివేయాలి.
DIY బాడీ స్క్రబ్: అర కప్పు కొబ్బరి నూనెను అర కప్పు చక్కెర లేదా కాఫీ పొడితో కలిపి ఇంట్లోనే ఎక్స్‌ఫోలియేటింగ్ బాడీ స్క్రబ్‌గా తయారు చేసుకోవచ్చు. ఇది మృత కణాలను తొలగించి.. చర్మానికి మెరుపునిస్తుంది.
2. జుట్టు ఆరోగ్యం:
డీప్ కండిషనర్: కొబ్బరి నూనె జుట్టు లోపల వరకు చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. తలస్నానం చేయడానికి ముందు గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు పగుళ్లు తగ్గుతాయి.
చుండ్రు నివారణ: కొబ్బరి నూనెలోని యాంటీఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌తో పోరాడటానికి సహాయ పడతాయి. రాత్రి పడుకునే ముందు నూనె రాసి, ఉదయం శుభ్రం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. అంతే కాకుండా స్కాల్ప్‌లో తేమ పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల: కొబ్బరి నూనెలో ఆమ్ల, మెంతులు లేదా కరివేపాకు వంటి పదార్థాలను కలిపి నూనెను కాచి మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. ఫలితంగా జుట్టు బలంగా మారుతుంది.
3. నోటి ఆరోగ్యం:
ఆయిల్ పుల్లింగ్: ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన ‘ఆయిల్ పుల్లింగ్’ కోసం కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. ఉదయం పరగడపున ఒక చెంచా కొబ్బరి నూనెను నోటిలో పోసుకుని 10-20 నిమిషాలు పుక్కిలించడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది. అంతే కాకుండా చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాస కూడా తాజాగా ఉంటుంది.
4. ఇతర ఉపయోగాలు:
చిన్న చిన్న గాయాలు : కొబ్బరి నూనెలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు చిన్న గాయాలు, లేదా గీతలు త్వరగా మానడానికి సహాయపడతాయి. ఇది ఇన్ఫెక్షన్‌ను నివారించి.. చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.
లిప్ బామ్: చలికాలంలో పెదవులు పగలడం లేదా పొడిబారడం సహజం. కొబ్బరి నూనెను లిప్ బామ్‌గా ఉపయోగించడం ద్వారా పెదవులకు తేమను అందించవచ్చు.