Neem Oil For Skin: వేప నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. వేప ఆకులు, బెరడు, కాయలు ఇలా అన్నీ భాగాలు అద్భుత ప్రయోజనాలను అందిస్తాయి. చర్మ సౌందర్యానికి కూడా వేప నూనె చాలా మేలు చేస్తుంది. ముఖం మీద వేప నూనెను అప్లై చేయడం వల్ల దురద, మొటిమలు, మచ్చలు, సోరియాసిస్ వంటి సమస్యలు సులభంగా నయమవుతాయి. వేపనూనెలో అమైనో ఆమ్లాలు, విటమిన్ ఇ ,కొవ్వు ఆమ్లాలు మొదలైనవి ఉంటాయి . వేప నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ స్కిన్ కేర్ రొటీన్‌లో వేప నూనెను సులభంగా చేర్చుకోవచ్చు. ముఖానికి వేప నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మచ్చలను తగ్గిస్తుంది:
ముఖానికి వేప నూనె రాయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. ముఖం మీద ఉన్న మచ్చలపై వేపనూనె రాసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. వేప నూనె ముఖం టానింగ్ నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
దురద తగ్గిస్తుంది:
మీ ముఖంపై దద్దుర్లు ఉంటే మీ ముఖానికి వేప నూనె రాయండి. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురద నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వేప నూనెను ఉపయోగించడానికి, దురద ఉన్న ప్రదేశంలో చేతితో లేదా కాటన్ తో అప్లై చేయండి. 5 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోండి. దురద సమస్య తొలగిపోతుంది.
వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది:
వేప నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య సంకేతాలను నివారించడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ముఖానికి వేప నూనెను క్రమం తప్పకుండా రాయడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి.
మొటిమలను తగ్గిస్తుంది:
మొటిమలను తగ్గించడంలో వేప నూనె సహాయపడుతుంది. వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడమే కాకుండా వాటి మచ్చలను కూడా తొలగిస్తాయి. ఇందులో ఉండే లక్షణాలు చర్మంపై మొటిమలు రాకుండా నివారిస్తాయి.
డ్రై స్కిన్ సమస్యను తొలగిస్తుంది:
ముఖానికి వేప నూనె రాయడం వల్ల పొడి చర్మం సమస్య తొలగిపోతుంది. వేప నూనె చర్మానికి పోషణనిచ్చి, చర్మం పొడిబారడాన్ని తొలగిస్తుంది. వేప నూనెను ఉపయోగించడానికి వేప నూనెలో కొన్ని చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల పొడి చర్మ సమస్య తొలగిపోయి ముఖం రంగు మెరుగుపడుతుంది.
Also Read: కాఫీ పౌడర్‌తో ఫేషియల్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం
ఆయిల్ స్కిన్‌కు మేలు:
వేప నూనెలోని సహజ కొవ్వు ఆమ్లాలు మీ చర్మం యొక్క సెబమ్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తద్వారా ముఖం జిడ్డుగా అనిపించదు. ఇది మీ ముఖంపై మెరుపును తిరిగి తెస్తుంది. అంతే కాకుండా ఆయిల్ స్కిన్ సమస్యను కూడా తగ్గిస్తుంది.