Mirror: మనుషులకి అద్దం అంటే చాలా ఇష్టం. ఉదయం లేచిన వెంటనే అద్దంలో మన ముఖాన్ని చూస్తాం, బయటకు వెళ్లే ముందు మన లుక్ చెక్ చేస్తాం, కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు అద్దంలో మనల్ని మనమే చూసుకుంటాం. ఇది మన జీవితంలో భాగమే అయిపోయింది. కానీ అద్దంలో ఎక్కువ సార్లు ముఖాన్ని చూడటం మంచిది కాదని మన పురాతన శాస్త్రాలు, తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి.
ముందుగా మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అద్దం అనేది కేవలం గాజు కాదు. అది మన కాంతిని తిరిగి ప్రతిబింబిస్తుంది. మన ముఖం, మన కళ్ళలోని వెలుగు, మన శరీరంలోని ఎనర్జీ ఇవన్నీ అద్దం ద్వారా తిరిగి ప్రతిబింబం రూపంలో మనపైకి వస్తాయి. ఈ ప్రతిబింబం మన మనసుపై, మన మానసిక స్థితిపై చాలా సూక్ష్మమైన ప్రభావం చూపుతుంది.
తంత్ర శాస్త్రం
తంత్ర శాస్త్రం ప్రకారం, ప్రతి మనిషిలో ఒక “ప్రాణశక్తి” ఉంటుంది. దానిని “చేతన శక్తి” అంటారు. మన కళ్ళు ఆ శక్తికి కిటికీలు. మనం అద్దంలో ఎక్కువసార్లు మన కళ్ళలోకి చూస్తూ ఉంటే, ఆ ప్రతిబింబం మన ప్రాణశక్తిని నెమ్మదిగా తగ్గిస్తుంది. అదే కారణంగా, పాతకాలంలో పెద్దవాళ్లు అద్దం దగ్గర ఎక్కువసేపు ఉండొద్దు, రాత్రిపూట ముఖం చూడొద్దు అని హెచ్చరించేవారు.
వేద శాస్త్రం
వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అద్దం శని తత్త్వంకి సంబంధించినది. శని అంటే నియమం, నిశ్శబ్దం, ఆత్మపరిశీలన. కానీ ఎప్పటికప్పుడు మనల్ని మనమే అద్దంలో పరిశీలించడం అంటే శని తత్త్వానికి విరుద్ధం . అలా చేసినప్పుడు మనలో అహంకారం, గర్వం, లేదా మానసిక అస్థిరతలు పుడతాయని చెబుతుంది.
అద్దం- ఆధ్యాత్మిక గ్రంథాలు
మరోవైపు, ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అద్దంలో మన ముఖం చూడటం అంటే మన ఆత్మని మనం చూసుకోవడం. అది ఆధ్యాత్మికంగా గంభీరమైన క్రియ. అందుకే దాన్ని మితంగా మాత్రమే చేయాలి. ఉదయం స్నానం చేసిన తరువాత లేదా బయటకు వెళ్లే ముందు ఒకసారి అద్దంలో చూడటం శుభప్రదం. కానీ మాటి మాటికీ రోజుకు పలుమార్లు అద్దంలో చూసుకోవడం ఆత్మశక్తిని తగ్గిస్తుంది, మానసిక దృష్టిని చెదరగొడుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికం కాదు, మనోవైజ్ఞానిక కోణంలో కూడా నిజమే.
అద్దం పదే పదే చూడటం మానసిక స్థితి
ఒక వ్యక్తి తరచుగా అద్దంలో తనను చూసుకోవడం అంటే అతని మైండ్ ఎప్పటికప్పుడు తన రూపం, ఆకారం, అసంపూర్ణతలు మీదే దృష్టి పెట్టడం. దీని వలన ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, ఆందోళన, అభద్రత పెరుగుతాయి. పరిశోధనల్లో కూడా ఇది నిజమని తేలింది. “అద్దం చూసే రుగ్మత” అనే ఒక మానసిక స్థితి ఉంది. ఈ వ్యాధి ఉన్నవారు రోజుకి పది, ఇరవై సార్లు అద్దం ముందు నిలబడి తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. తాము అందంగా ఉన్నామా, చెడ్డగా ఉన్నామా అని విచారిస్తూ తమ మనసును తామే కుంగదీసుకుంటారు.
Also Read: Smartphones: రూ.8 వేల లోపు బ్రాండెడ్ స్మార్ట్ పోన్ల లిస్ట్.. మరి అంత చవకగా ఎలా?
శాస్త్రీయ పరంగా అద్దంలో చూడటం
శాస్త్రీయంగా చూస్తే, మనం అద్దంలో ముఖం చూస్తున్నప్పుడు మన మెదడు “స్వీయ-గుర్తింపు లూప్” అనే చక్రంలో పడుతుంది. అదే సర్క్యూట్‌ను తరచుగా యాక్టివేట్ చేస్తే మన శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి. దాని ఫలితంగా మన మెదడుకు అలసట వస్తుంది. అంతేకాదు, నిద్రలో కూడా మన మనసు మన రూపం గురించే ఆలోచిస్తుంది. దాంతో మానసికంగా అశాంతి పెరుగుతుంది.
పురాణాల్లో ఏమన్నారంటే..
పురాణాల్లో కూడా అద్దం గురించి చాలా ఆసక్తికరమైన సూచనలు ఉన్నాయి. కొందరు తంత్రులు చెబుతారు. అద్దం దేవతలతో మాట్లాడే ఒక ద్వారం లాంటిదని. దానిలో ఎక్కువసేపు మన దృష్టిని నిలిపితే, మన ఆత్మ ప్రతిబింబం ఆ గాజులో బంధించబడుతుందని. ఇది శాస్త్రోక్తమా లేదా అనేది వేరే విషయం, కానీ ఈ నమ్మకం వెనుక ఉన్న తాత్పర్యం చాలా గంభీరం. అద్దం మన అంతర్ముఖాన్ని చూపుతుంది, దానిని తరచుగా డిస్టర్బ్ చేయకూడదు అని దాగిన సందేశం ఉంది.
కేవలం ఒక్కసారి మాత్రమే ..
అందుకే పాతకాలంలో రాజమహల్లలో అద్దాలు చాలా పెద్దవి ఉండేవి, కానీ వాటి ముందు రోజుకి ఒక్కసారి మాత్రమే నిలబడేవారు. ముఖ్యంగా రాత్రిపూట ఎవ్వరూ అద్దం చూడరు. ఎందుకంటే రాత్రి సమయంలో మన ప్రకాశం, మన శక్తి బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో అద్దం ప్రతిబింబం దాన్ని మరింతగా దెబ్బతీస్తుంది అని నమ్మకం ఉంది.
స్మార్ట్‌ఫోన్లలో సెల్ఫీలు
ఈరోజుల్లో కూడా మనం స్మార్ట్‌ఫోన్లలో, సెల్ఫీల్లో, కెమెరా స్క్రీన్‌లలో మన ముఖాన్ని ఎన్నో సార్లు చూస్తూనే ఉంటాం. అది కూడా ఒక రకంగా “ఆధునిక అద్దం” లాంటిదే. ఫలితంగా మన మెదడు ఎప్పటికప్పుడు సెల్పీ ఇమేజ్ మీదే దృష్టి పెట్టడం వలన మనకు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది.
2–3 సార్లకు మించి వద్దు
అందుకే మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు రోజులో 2–3 సార్లకు మించి అద్దం ముందు ఉండకండి, రాత్రిపూట లేదా నిద్రకు ముందు అద్దం చూడకండి. మనం అద్దంలో ఎంత తక్కువ చూస్తామో, అంత ఎక్కువగా మన లోపల మనల్ని మనం గుర్తించగలం. ముఖం బయటికి ఉన్న రూపం మాత్రమే, కానీ నిజమైన ప్రతిబింబం మన మనసులో ఉంటుంది. అద్దం దానిని చూపించలేడు. దాన్ని మనం మన హృదయంలోనే చూడాలి.