E-Paper
Advertisement

మరీ ఇంత మంచితనం పనికిరాదు.. ఈ తేదీల్లో పుట్టినవారు అమాయకులు.. మళ్లీ మళ్లీ మోసపోతారు

మరీ ఇంత మంచితనం పనికిరాదు.. ఈ తేదీల్లో పుట్టినవారు అమాయకులు.. మళ్లీ మళ్లీ మోసపోతారు
Advertisement

న్యూమరాలజీ (సంఖ్యా శాస్త్రం) ప్రకారం ప్రతి మూల అలంకానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి ఆలోచనా విధానం, ప్రవర్తన, భావోద్వేగాలు మారుతాయి. కొన్ని మూల అంకాల వారు చాలా తెలివిగా ఉంటే, మరికొందరు అమాయకంగా, నమ్మకంగా ఉంటారని న్యూమరాలజీ చెబుతోంది.

మూల అంకం 2కి చెందినవారు

ఏ నెలలో అయినా 2, 11, 20 లేదా 29 తేదీలలో పుట్టినవారి మూల అంకం 2గా పరిగణిస్తారు. ఈ మూల అంకానికి చంద్రుడు అధిపతిగా భావిస్తారు. చంద్రుడు.. భావోద్వేగాలు, సున్నితమైన స్వభావానికి ప్రతీక. అందువల్ల ఈ మూల అంకం ఉన్నవారు సాధారణంగా మృదువైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు.

చాలా అమాయకంగా, నిజాయితీగా ఉంటారు

Advertisement

మూల అంకం 2 ఉన్నవారికి ఇతరులను సులభంగా నమ్మే స్వభావం ఉంటుంది. ఎదుటివారి ఉద్దేశాలను ఎక్కువగా అనుమానించరు. వారి మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వారు ద్వేషాన్ని పెంచుకోవడం కన్నా క్షమించడం ఇష్టపడతారు.

భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

ఈ వ్యక్తులు చిన్న విషయానికే బాధపడతారు. ఇతరుల మాటలను మనసులో పెట్టుకుని ఎక్కువగా ఆలోచిస్తారు. అదే సమయంలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందుంటారు. అయితే భావోద్వేగాల ప్రభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడతారు.

త్వరగా నమ్మడం వీరి బలహీనత

Advertisement

మూలాంకం 2 వారి ముఖ్యమైన లక్షణం నమ్మకం. వారు ఎక్కువ ఆలోచించకుండా మాటలను నమ్మేస్తారు. దీంతో కొన్నిసార్లు మోసపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఒకసారి కాదు, పలుమార్లు నిరాశ ఎదురైనా వారి స్వభావం సులభంగా మారదు.

కుటుంబం, బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు

ఈ వ్యక్తులు కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమిస్తారని చెబుతారు. బంధాలను కాపాడుకోవడానికి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో శాంతి ఉండాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆనందం కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నమ్మకం, విధేయత వారి బలమైన లక్షణాలు.

Also Read: కేవలం రొమాన్స్ మాత్రమే ప్రేమ కాదు.. ప్రేమలో ఈ 8 రూపాలు తెలుసా

ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు

మూల అంకం 2 ఉన్నవారు సహాయక స్వభావాన్ని ప్రదర్శిస్తారు. స్నేహితులు, బంధువులు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే అండగా నిలబడతారు. ఇతరులకు ఉపయోగపడటం ద్వారా సంతృప్తిని పొందుతారు. అయితే తమ మంచితనానికి హద్దులు పెట్టుకోవడం కూడా అవసరం.

మంచితనంతో పాటు జాగ్రత్త కూడా అవసరం

ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించడం మంచిది. సంబంధాలు సమయంతో పాటు బలపడాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆ తరువాత నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. స్వీయ గౌరవాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.

Related News

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు

మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరసంగా అనిపిస్తోందా? రోజంతా ఫుల్ ఎనర్జీ కోసం సింపుల్ టిప్స్

అవసరం తీరిపోయాక పట్టించుకోరు.. ఈ రాశుల్లో పుట్టినవారు స్వార్థపరులు

ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు

పవిత్రమైన తులసి.. గణపతికి మాత్రం పెట్టరు.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత తొలి వినాయక చవితి.. నవదంపతులు తప్పక పాటించాల్సిన 7 అందమైన సంప్రదాయాలు

ఏనుగు తల నుంచి 21 పత్రుల వరకు.. గణపతి గురించి 5 ఆసక్తికర విషయాలు!

Big Stories

Advertisement
×