Sunil Gavaskar On IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతోన్న టీ20 సిరీస్ లో వరుస విజయాలతో దూసుకెళుతోన్న టీమిండియా స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆక్లాండ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓడించింది. న్యూజిలాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఏకంగా 87 పరుగుల తేడాతో ఓడింది.
నాలుగో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడంపై సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. గంభీర్ బుర్ర తక్కువ నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిపోయిందని విమర్శలు చేశారు. మూడో టీ20లో ఆడిన జట్టునే బరిలోకి దింపకుండా టీమిండియా కొంపముంచాడని ఆగ్రహించాడు. సిరీస్ గెలిచిన తరుణంలో ఐదో టీ20లో ప్రయోగాలు చేస్తే బాగుండని సూచనలు చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని పక్కకు పెట్టి, ఓటమికి గంభీర్ కారణమయ్యాడని ఆగ్రహించారు. వైభవ్ సూర్యవంశీని బరిలోకి దింపి, ఓపెనర్ గానే పంపింటే ఇవాళ మంచి ఇన్నింగ్స్ ఆడేవాడని తెలిపాడు. అనవసరంగా ఇషాన్ కిషన్ ను తీసుకొచ్చి కొంపముంచాడని సీరియస్ అయ్యాడు.
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాళ ఆక్లాండ్ వేదికగా నాల్గవ టి20 జరిగింది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా ఫస్ట్ బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో ఇరగదీసాడు. 49 బంతుల్లో 107 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ 10 సిక్సులతో పాటు ఆరు బౌండరీలు సాధించాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ (Michael Bracewell) 25 బంతుల్లో 65 పరుగులతో రాణించాడు. ఇక కివీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విఫలమైన టీమిండియా, 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులే సాధించింది.
దీంతో 87 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ 27, శ్రేయస్ 22, నితీశ్ 21, తిలక్ 35, నమన్ ధీర్ 28 పరుగులు చేశారు. మూడో టీ20లో ఇరగదీసిన బ్యాటర్లు, ఈ మ్యాచ్ లో రాణించ లేకపోయారు. దానికి తోడు ఇవాళ్టి మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలోని న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. టార్గెట్ పెద్దది కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ ఐదు టీ20 సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, ట్రోఫీ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య వచ్చే నెలలో 5 వన్డేల సిరీస్ జరుగనుంది. ఆ తర్వాత రెండు టెస్టులు కూడా జరగనున్నాయి.