E-Paper
Advertisement

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!

పాలు,పంచదార ఉంటే చాలు..ఇంట్లోనే దూది లాంటి రసగుల్లా రెడీ!
Advertisement

Rasgulla recipe:  ప్రస్తుత రోజుల్లో బయట కొనే.. స్వీట్స్‌లో కలర్ కలుపుతారనే భయం,క్వాలిటీ సరిగ్గా ఉండదనే టెన్షన్ అందరిలోనూ ఉంటుంది. అందుకే చాలా మంది తమ ఫ్యామిలీ ఆరోగ్యం కోసం ఇంట్లోనే సరి కొత్త వంటకాలు, స్వీట్లు తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందులోనూ.. రసగుల్లా చాలా మందికి ఇష్టమైన స్వీట్.కొంత మంది రసగుల్లా చేయడం చాలా కష్టం, వెంటనే గట్టిగా అయిపోతాయని భయపడుతుంటారు. కానీ పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. స్వీట్ షాప్ కంటే అద్భుతంగా ఇంట్లోనే రసగుల్లా తయారు చేసుకోవచ్చు.అదెలాగంటే..

1. కావలసిన పదార్థాలు :

చిక్కటి పాలు- 1 లీటర్

Advertisement

నిమ్మరసం లేదా వెనిగర్ -2 లేదా 3 స్పూన్లు

పంచదార – 1.5 కప్పులు

Advertisement

నీళ్లు – 4 లేదా 5 కప్పులు

యాలకుల పొడి – చిటికెడు

2. రసగుల్లా సాఫ్ట్‌గా రావడానికి పన్నీర్ తయారీ విధానం చాలా ముఖ్యం. ఇందు కోసం ముందుగా ఒక గిన్నెలో లీటర్ పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, అందులో కొద్దిగా.. నీళ్లు కలిపిన నిమ్మరసం లేదా వెనిగర్‌ను కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పాలు పూర్తిగా విరిగి నీరు, పన్నీర్ వేరుపడతాయి.చఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ లేదా పలుచని క్లాత్ లో విరిగిన పాలను వడకట్టాలి. ఆపై పన్నీర్‌పై పచ్చి వాసన పోయేలా.. మంచి నీళ్లతో బాగా కడగాలి.
ఇప్పుడు ఆ క్లాత్ లో ఉన్న నీరంతా గట్టిగా పిండేసి, పన్నీర్‌ను ఒక ప్లేట్‌లో తీసుకోవాలి.

Also Read: స్వీట్ తినాలనిపిస్తే చాలు..ఈజీగా ఇలా రవ్వ బర్ఫీ చేయండి

3. రసగుల్లాలు గుల్లగా రావడానికి ఇక్కడే అసలైన రహస్యం ఉంది. పన్నీర్‌ను అరచేతి అడుగు భాగంతో సుమారు 7 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి.
పన్నీర్ ముద్దలా కాకుండా వెన్నలా చాలా సాఫ్ట్‌గా మారాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఎక్కడా పగుళ్లు లేకుండా చూసుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో 1.5 కప్పుల పంచదార, 4 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. రసగుల్లాకు పాకం అవసరం లేదు. పంచదార నీళ్లలో పూర్తిగా కరిగి మరిగితే స రిపోతుంది. ఇప్పుడు మరుగుతున్న నీటిలో ముందుగా సిద్ధం చేసుకున్న రసగుల్లా ఉండలను ఒక్కొక్కటిగా వేయాలి.తర్వాత గిన్నెపై మూతపెట్టి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ సమయంలో .. రసగుల్లాలు సైజులో రెట్టింపు అవుతాయి.మధ్యలో మూత తీయకూడదు.

అంతే! అద్భుతమైన స్పాంజి లాంటి రసగుల్లాలు రెడీ. వీటిని కాసేపు చల్లార బెట్టి, ఫ్రిజ్‌లో ఉంచి తింటే.. ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. పాలు, పంచదారతో అతి తక్కువ సమయంలో.. చేసుకోగల ఈ ట్రెండీ స్వీట్‌ను ఈ పండగకు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి!

Related News

ఎప్పుడూ చేసుకునే దొండకాయ ఫ్రై బోర్ కొట్టిందా?ఈసారి ఇలా ట్రై చేయండి

గోధుమపిండితో చల్ల పునుగులు..మైదా లేకుండానే బెస్ట్ టేస్ట్

నిద్రలోనే పక్షవాతం రావచ్చు.. ఉదయం లేవగానే ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు

రోజూ బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాసన తగ్గడం లేదా? దీనికి కారణాలు ఇవే

కత్తెర సరిగ్గా కట్ చేయడం లేదా? ఎక్కువకాలం పదునుగా ఉండాలంటే ఇంట్లోనే ఇలా చేయండి

ఎండ లేకపోయినా బట్టలు త్వరగా ఆరిపోతాయి.. ఈ 5 సింపుల్ టిప్స్ పాటిస్తే సరి

‘ఐ లవ్ యూ’ చెప్పడం మాత్రమే సరిపోదు.. మీ లవర్‌కు నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం

Big Stories

Advertisement
×