Honeywell air purifier v1: ప్రతిరోజూ మనం పీల్చే గాలిలో.. ఉండే దుమ్ము, ధూళి, పొగ , సూక్ష్మ కాలుష్య కారకాలు మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారికి.. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రముఖ బ్రాండ్ హానివెల్ సంస్థ తక్కువ బడ్జెట్‌లో “ఎయిర్ టచ్ V1″ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది ఇళ్లు, ఆఫీసులకు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. తక్కువ ధరలు బెస్ట్ ఎయిర్ ఫ్యూరిపైయర్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకత దీనిలోని అడ్వాన్స్‌డ్ ఫిల్టర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇందులో మూడు రకాల ఫిల్టర్లు ఉంటాయి. గాలిలో ఉండే పెద్ద పెద్ద దుమ్ము ధూళి కణాలు, జంతువుల వెండ్రుకలను ఇది మొదటగా అడ్డుకుంటుంది. ఫిల్టర్ దీనిలో అత్యంత ముఖ్యమైన భాగం. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన 2.5 మైక్రాన్ కణాలు, పుప్పొడి రేణువులు, ఇతర హానికరమైన అలర్జీ కారకాలను ఇది 99.99 శాతం తొలగిస్తుంది. ఇందులోని యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ ఇంట్లో వచ్చే చెత్త వాసనలు, సిగరెట్ పొగ, వంట గాలిలోని .. చెడు వాసనలను ఇది సమర్థవంతంగా పీల్చుకుని గాలిని తాజాగా మార్చుతుంది.
ఈ పరికరం గదిలోని గాలిని చాలా తక్కువ సమయంలో పూర్తిగా శుభ్రపరుస్తుంది. పెంపుడు జంతువులు ఉండే ఇళ్లలో వచ్చే డ్యాండర్, గాలిలోని పొగ, దుమ్మును ఇది ఇట్టే శుభ్రం చేస్తుంది. ఆస్తమా లేదా ఇతర శ్వాస కోస సమస్యలు ఉన్నవారికి ఈ పరికరం ఇంట్లో ఉండటం ఎంతో మేలు చేస్తుంది. గదిలోని గాలి నాణ్యతను కూడా ఇది నిరంతరం మెరుగు పరుస్తుంది.
ఇది చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. లివింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా ఆఫీస్ క్యాబిన్లలో ఎక్కడైనా దీనిని ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది పని చేసేటప్పుడు పెద్దగా సౌండ్ చేయదు. రాత్రి సమయంలో.. నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకు పోతుంది. యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ ఉండటం వల్ల దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ.
ఇళ్లలో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో.. కరెంట్ బిల్లు ఎంత వస్తుందనే టెన్షన్ అందరికీ ఉంటుంది. ఈ హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా తక్కువ పవర్‌ను వినియోగించుకుంటుంది. దీని లోని ఫిల్టర్లను మార్చడం కూడా చాలా ఈజీ. ఫిల్టర్ లైఫ్ ముగిసినప్పుడు అది ఇండికేటర్ ద్వారా మనకు తెలియ జేస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్‌వాచ్..నాయిస్ నుంచి కొత్త మోడల్ లాంచ్
అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ హానివెల్ ఎయిర్ టచ్ V1 ఎయిర్ ప్యూరిఫైయర్ ధర బడ్జెట్ యూజర్లకు అనుకూలంగా ఉంది. మార్కెట్లో దీని అధికారిక ధర సుమారు రూ.5,149 గా ఉంది. తక్కువ ధరలో హెచ్‌ఈపీఏ ఫిల్టర్ సపోర్ట్ కోరుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.
మొత్తానికి..మన ఇంట్లోని గాలిని స్వచ్ఛంగా ఉంచుకుంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హానివెల్ ఎయిర్ టచ్ V1 ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. కాలుష్యం బారి నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఈరోజే మీ ఇంటికి తెచ్చుకోండి!