BigTV English

Otti Tunakala Curry: నాన్ వెజ్ ప్రియుల కోసం ఒట్టి తునకల కూర రెసిపీ, తిన్నారంటే మరిచిపోలేరు

Otti Tunakala Curry: నాన్ వెజ్ ప్రియుల కోసం ఒట్టి తునకల కూర రెసిపీ, తిన్నారంటే మరిచిపోలేరు

Otti Tunakala Curry: రాయలసీమలో ప్రత్యేకంగా ఉండే వంటకం ఒట్టి తునకల కూర. ఒట్టి తునకలను మటన్ లేదా చికెన్ తో తయారు చేసుకోవచ్చు. వీటినే చికెన్ వడియాలు లేదా చికెన్ ఒరుగులు అని కూడా పిలవచ్చు. మటన్ తో చేస్తే మటన్ ఒరుగులు, మటన్ వడియాలు అంటారు. ఒక్కసారి ఈ ఒట్టి తునకల్ని చేసి పెట్టుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు. ఎప్పుడు మీకు మటన్, చికెన్ కూర తినాలనిపించినా ఈ ఒట్టి తునకలతో కూర వండేసుకోవచ్చు. పాతకాలంలో రాయలసీమలో ఇవి ఎంతో ఫేమస్. ఇప్పటికీ కూడా ఒట్టి తునకల కూరను ఇష్టంగా తినే వారి సంఖ్య ఎక్కువే. దీన్ని ఎలా చేయాలో, ఒట్టి తునకల కూర ఎలా వండాలో తెలుసుకోండి.


ఒట్టి తునకల కూర రెసిపీ
ఒట్టి తునకలు – ఒక కప్పు
టమోటోలు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – రెండు
బిర్యానీ ఆకులు – రెండు
లవంగాలు – మూడు
కారం – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
పచ్చిమిర్చి – నాలుగు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
నూనె – సరిపడినంత
ఉప్పు – రుచికి సరిపడా

Also Read: జుట్టుకు చుండ్రు పట్టిందా? షాంపూలు వాడకుండా ఇంట్లోనే ఈ సులభమైన పద్ధతులతో వదిలించేయండి


ఒట్టి తునకల కూర రెసిపీ
1. ముందుగా ఒట్టి తునకలను రెడీ చేసుకోవాలి.
2. చికెన్ లేదా మటన్ ముక్కలను కట్ చేసుకుని పసుపు కలిపి ఎండలో ఎండబెట్టుకోవాలి.
3. అవి వడియాల్లాగా బాగా ఎండిపోవాలి. గిన్నెలో వేసి సౌండ్ చేస్తే గలగల లాడేలా ఎండిపోవాలి.
4. అలా చికెన్, మటన్ ముక్కలు ఎండిపోతే వాటిని చికెన్ ఒరుగులు లేదా మటన్ ఒరుగులు అంటారు. అలాగే ఒట్టి తునకలు అని కూడా అంటారు.
5. ఈ ఒట్టి తునకల్ని ఒక స్టీల్ డబ్బాలో వేసి దాచుకోవాలి.
6. మీకు ఎప్పుడు ఒట్టి తునకల కూర తినాలనిపించినా ఈ ఒరుగుల్ని తీసి వండుకోవచ్చు.
7. ముందుగా ఒట్టి తునకల్ని వేడి నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు అవి నానుతాయి.
8. ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
9. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించుకోవాలి.
10. తర్వాత ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.
11. వీటి వాసన పోయి రంగు మారేవరకు వేయించాలి.
12. ఆ తర్వాత సన్నగా కోసిన టమాటా ముక్కలను వేసి వేయించాలి.
13. ఆ టమాటా ముక్కల్లోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
14. పైన మూత పెట్టి పది నిమిషాలు ఉంచితే టమోటోలు మెత్తగా అయ్యి ఇగురులాగా అవుతాయి.
15. అప్పుడు నీళ్లలో నానబెట్టుకున్న ఒట్టి తునకల్ని కూరలో వేసి బాగా కలుపుకోవాలి.
16. తర్వాత మూత పెట్టి పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
17. ఇగురు కావాలనుకుంటే కాస్త నీరు వేసి ఓ పది నిమిషాలు పాటు ఉడికించాలి.
18. స్టవ్ ఆపేసే ముందు పైన కొత్తిమీరని చల్లుకోవాలి.
19. అంతే టేస్టీ ఒట్టి తునకల కూర రెడీ అయిపోయినట్టే.
20. మీరు చికెన్ తో వండుకుంటారో, మటన్ తో వండుకుంటారో మీ ఇష్టం… ముందుగా ఒట్టి తునకలను రెడీ చేసి పెట్టుకోవాలి.

ఒట్టి తునకల కూర చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఒక్కసారి తిన్నారంటే మీరు జీవితంలో మర్చిపోలేరు. ఎర్రటి ఎండలో ఒట్టి తునకలను రెడీ చేసి పెట్టుకొని తర్వాత ఏడాదంతా వాటిని కూరగా వండుకొని ఎంజాయ్ చేయవచ్చు. వీటిలో పోషకాలు కూడా తగ్గవు. చికెన్, మటన్ లో ఉండే పోషకాలు వీటిలో కూడా ఉంటాయి. ఒకసారి మీరు వండుకొని చూడండి, మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఎండు చేపల్ని ఎలా అయితే దాచి పెట్టి వండుకుంటామో, అలాగే ఎండు మాంసాన్ని కూడా కూరగా వండుకోవడమే. ఇప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని సులువుగా వండేసుకోవచ్చు. ఒట్టి తునకలు పాడవుతాయనే భయం కూడా లేదు ఎన్నో నెలల పాటు ఇది నిల్వ ఉంటాయి.

ఒట్టి తునకుల కూర తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇది ఆకలిని పెంచడంలో ముందుంటుంది. అంతేకాదు కండరాలు పుష్టిగా ఎదిగేలా చేస్తుంది. అలాగే ఎముకలను కూడా బలంగా మారుస్తుంది. ఒట్టి తునకల కూర తినడం వల్ల గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. నిజానికి మటన్ కన్నా చికెన్ ఒట్టి తనుకుల కూరని అధికంగా తింటే మంచిది. మటన్ అధికంగా తింటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరవచ్చు. కాబట్టి చికెన్ అధికంగా తింటేనే అన్ని రకాల ఉత్తమం.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×