పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అనే విషయం అందరికీ తెలుసు. దాడుల్ని ప్రోత్సహించే ఏ దేశం అయినా, చివరకు ఆ దాడుల వల్లే నాశనం అవుతుంది. కానీ పాకిస్తాన్ ని బాంబు దాడుల కంటే మరో విషయం భయపెడుతోంది. అదే డయాబెటిస్. ఒకరకంగా డయాబెటిస్ వ్యాధి ప్రపంచాన్నే భయపెడుతోంది. కరోనా రోజుల వ్యవధిలో ప్రాణాలు తీస్తే, డయాబెటిస్ వంటి వ్యాధులు.. ఏళ్ల తరబడి మనలోని రోగ నిరోధక వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, మరణానికి దగ్గర చేస్తాయి. అలాంటి భయంకరమైన మధుమేహ వ్యాధిలో పాకిస్తాన్, ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంది.
ప్రమాదంలో దక్షిణాసియా..
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికేడాది మధుమేహం బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో దక్షిణాసియాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఇది అంటువ్యాధి కాదు, సరైన జీవన విధానం లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి. అంటే ఒకరకంగా మనం కొని తెచ్చుకునేదనమాట. దక్షిణాసియాలో మానవుల జీవన శైలిలో వస్తున్న విపరీతమైన మార్పులే మధుమేహానికి స్వాగతం పలుకుతున్నాయి. పాకిస్తాన్ లో ఈ జీవనశైలి మార్పులు మరీ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ దేశంలో 20నుంచి 79 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్నవారిలో 30.8 శాతం మందికి మధుమేహం ఉంది. కువైట్ లో షుగర్ వ్యాధిగ్రస్తులు 24.9శాతం మంది, ఈజిప్ట్ లో 20.9శాతం, ఖతార్ లో 19.5 శాతం మంది ఉన్నారు. ఇక భారత్ లో 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 9.6 శాతం మంది ఉన్నారు.
Diabetes rates:
🇵🇰 Pakistan: 30.8%
🇰🇼 Kuwait: 24.9%
🇪🇬 Egypt: 20.9%
🇶🇦 Qatar: 19.5%
🇲🇾 Malaysia: 19%
🇸🇦 Saudi Arabia: 18.7%
🇲🇽 Mexico: 16.9%
🇹🇷 Turkey: 14.5%
🇧🇩 Bangladesh: 14.2%
🇱🇰 Sri Lanka: 11.3%
🇿🇦 South Africa: 10.8%
🇮🇶 Iraq: 10.7%
🇺🇸 United States: 10.7%
🇮🇩 Indonesia:…— World of Statistics (@stats_feed) May 28, 2025
ప్రతి ముగ్గురిలో ఒకరికి షుగర్ వ్యాధి..
డయాబెటిస్ పేద దేశాలను చాపకింద నీరులా చుట్టేస్తోంది. పేద దేశాల్లో ఆహారపు అలవాట్లలో విపరీతమై మార్పులు చోటు చేసుకున్నాయి. జీవనశైలిలో వ్యాయామం కనుమరుగైంది, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి చోటు పెరిగింది. దీంతో పేద దేశాలే దీనిబారిన ఎక్కువగా పడుతున్నాయి. పాకిస్తాన్ డయాబెటిస్ రేటు 30.8 శాతం. అంటే అక్కడ వయోజనులైన ప్రతి ముగ్గురిలో ఒకరికి షుగర్ వ్యాధి ఉంది. పాకిస్తాన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అణ్వాయుధాలు అవసరం లేదు, చక్కెరే పాకిస్తాన్ ని సర్వనాశనం చేస్తుందని అంటున్నారు నెటిజన్లు.
పాక్ లో ఊబకాయులు అధికం..
పాకిస్తాన్ లో చాలామంది ఊబకాయులు ఉన్నారు. దాదావు 57 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు కూర్చుని పనిచేయడం అలవాటు చేసుకున్నారు. వారికి వ్యాయామం ఉండదు, పెద్దగా శరీరం అలసిపోదు. ఆఫీస్ లలో అదే పనిగా కూర్చుని ఉండేవారికి కూడా డయాబెటిస్ సోకుతోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పెద్దగా ఖర్చు చేయదు. ఆ దేశ జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే ఆరోగ్య రంగానికి ఖర్చు చేస్తున్నారు. అంటే వైద్య పరీక్షలు కూడా పెద్దగా జరగడంలేదు. దాదాపు 26.9 శాతం మందికి తమకు డయాబెటిస్ ఉందని కూడా తెలియదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సైలెంట్ కిల్లర్..
పాకిస్తాన్ లో డయాబెటిస్ సైలెంట్ కిల్లర్ లాగా వ్యాపిస్తోంది. ఆ దేశ సాంస్కృతిక అలవాట్లు, వ్యాయామం లేని జీవన శైలి ఈ వ్యాధికి కారణం అవుతోంది. భారత్ లో కూడా డయాబెటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంది, అయితే పాకిస్తాన్ కంటే మనం కాస్త బెటర్. భారత్ లో జనాభా ఎక్కువ కావడంతో కేసులు కూడా ఎక్కువే. డయాబెటిస్ రేటు కేవలం 9.6 శాతం. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 13.4 కోట్లు. మెక్సికో, టర్కీ వంటి దేశాల్లో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల కంటే మనదేశంలోనే వారి సంఖ్య ఎక్కువ.
జన్యువులే కీలకం..
అసలు దక్షిణాసియా ప్రజల జన్యువులు డయాబెటిస్ కి ప్రధాన కారణంగా ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ తో పాటు, భారత్ లో కూడా వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువగా కూర్చుని ఉండే పనుల్ని చేయడం, మోతాదుకి మించి చక్కెర తీసుకోవడం, కొవ్వుతో కూడిన అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. ఇవన్నీ డయాబెటిస్ కి మనల్ని దగ్గర చేస్తాయి. అయితే భారత్ లో ఆరోగ్య కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే ఇక్కడ పరీక్షలు ఎక్కువగా జరుగుతాయి. వ్యాధి నిర్థారణ, నివారణకు ప్రయత్నాలు జరుగుతుంటాయి.
పాక్ వర్సెస్ భారత్..
పాకిస్తాన్ లో ఎక్కువమంది పట్టణాల్లో నివశిస్తున్నారు. అంటే ఆఫీస్ వర్క్ చేసేవారి సంఖ్య ఎక్కువ. భారత్ లో ఎక్కువమంది గ్రామాల్లో నివశిస్తున్నారు. అంటే ఇక్కడ ఆ ప్రమాదం తక్కువ. పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోగ్యానికి చేసే కేటాయింపులు తక్కువ. భారత్ లో అది ఎక్కువ. రెండు దేశాల్లో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటారు. కానీ భారత్ లో ఆహారంలో కాస్త వైవిధ్యం ఉంటుంది. దీంతో పాక్ తో పోల్చి చూస్తే మన దేశంలో ఊబకాయుల శాతం తక్కువ. పాకిస్తాన్ లో మహిళలకు ఉండే సామాజిక కట్టుబాట్లతో వ్యాయామం చేసే అలవాటు వారిలో తక్కువ. భారత్ లో ఇలాంటి సమస్య లేదు.