Janasena Atthi Satyanayana: ,క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు మధ్యలో నుండి కొన్ని కారణాల వలన దర్శకుడు కృష్ణ జాగర్లమూడి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా బాధ్యతలను ఏఎం రత్నం కొడుకు జయకృష్ణ తీసుకొని ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా మొదటి గ్లిమ్స్ విడుదల అయినప్పుడు విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తర్వాత వచ్చిన కంటెంట్ పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాకు ముందు ఉండే హడావిడి ఈ సినిమాకు కొంచెం తగ్గింది. ఏదేమైనా వీటన్నిటికంటే ముందు ఒక వివాదం నడిచింది. థియేటర్స్ బందుకు పిలుపు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది చివరి నిమిషంలో క్యాన్సిల్ అయింది.
ఆ నలుగురే కారణం
పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో థియేటర్స్ బందుకు పిలుపునివ్వడం అనే అంశం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. దీనితో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. టికెట్ రేట్స్ హైక్ కావాలన్నా కూడా ఫిలిం ఛాంబర్ నుంచి ఆదేశాలు రావాలి అంటూ మాట్లాడారు. గత ప్రభుత్వం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని క్రియేట్ చేసిన విధానాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉన్న సీఎంను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కలిసారా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ను ఇరిటేట్ చేసే రేంజ్ లో జరిగింది ఈ థియేటర్ల వ్యవహారం. ఇదంతా కూడా కేవలం ఆ నలుగురు నిర్మాతలే నడిపారు అంటూ వార్తలు వినిపించాయి. దానిలో ఇద్దరు నిర్మాతలు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు.
అత్తి సత్యనారాయణ ను ఇరికించారా.?
ఇక నిన్ననే జనసేన పార్టీ కీలక నేత అత్తి సత్యనారాయణ థియేటర్లో బంద్ విషయంలో పిలుపునివ్వడంలో కీలకపాత్ర వహించారు అంటూ ఆరోపణలు వచ్చాయి. తనకు దాదాపు 20 థియేటర్లు ఉన్నాయి. దీనితో జనసేన పార్టీ ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారు. అతి సత్యనారాయణ ఇప్పుడు ఈ విషయంపై స్వయంగా స్పందించారు. జూన్ 1న థియేటర్ల బంద్ అని ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి. ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి నాపై అభాండం వేశారు.. కమల్ హాసన్‌ను మించి ఆస్కార్ రేంజ్‌లో దిల్ రాజు నటించాడు.. దురుద్దేశంతోనే నా పేరు చెప్పారు.. పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారు. నేను థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదు అంటూ అత్తి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.
Also Read : Hari Hara Veeramallu: అసలేం ప్లాన్ చేశారో ఏంటో, హరిహర వీరమల్లు లో అనుదీప్ కేవి