E-Paper
Advertisement

నెలసరి ముందు వచ్చే కడుపు ఉబ్బరం.. ఏయే సమస్యలకు సంకేతం కావొచ్చు?

నెలసరి ముందు వచ్చే కడుపు ఉబ్బరం.. ఏయే సమస్యలకు సంకేతం కావొచ్చు?
Advertisement

Period Bloating: నెలసరి వచ్చే ముందు కడుపు ఉబ్బరంగా అనిపించడం చాలామందిలో కనిపించే సాధారణ విషయమే. పీరియడ్స్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ హార్మోన్లలో మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదించి, గ్యాస్ లేదా కడుపు భారంగా అనిపిస్తుంది. అయితే ఈ సమస్య పీరియడ్స్ మొదలైన ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది. కానీ ఈ ఉబ్బరం రోజుకోసారి రావడం, వారాల తరబడి తగ్గకుండా ఉండటం జరిగితే మాత్రం దాన్ని కేవలం హార్మోన్ల సమస్యగా లైట్ తీసుకోకూడదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పీరియడ్స్ ముందు ఎందుకొస్తుంది?

నెలసరి సమయానికి ముందు శరీరంలో జరిగే హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ తయారవడం, మలబద్ధకం లేదా కడుపు నిండిన భావన కలుగుతుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో శరీరం నీటిని నిల్వ ఉంచుకోవడం వల్ల కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. అయితే పీరియడ్స్ రాగానే ఈ సమస్య వాటంతట అవే తగ్గిపోతాయి. ఒకవేళ ప్రతి నెలా ఇదే పద్ధతిలో వస్తే దాన్ని మామూలు సమస్యగా భావించవచ్చు.

Advertisement

Also Read: ఎప్పుడైనా ఆలోచించారా? చాక్లెట్ బార్లపై ఆ గడులు ఎందుకు ఉంటాయో, దీని వెనుక ఇంత కథ ఉందా?

ఏయే లక్షణాలు ఉంటే ప్రమాదం?

కడుపు ఉబ్బరం కేవలం పీరియడ్స్‌కే పరిమితం కాకుండా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు సంకేతం కావచ్చు. ఉబ్బరం చాలా వారాల పాటు కొనసాగినా, ఎలాంటి పద్ధతి లేకుండా అకస్మాత్తుగా వస్తున్నా జాగ్రత్త పడాలి. దీనికి తోడు కడుపులో విపరీతమైన నొప్పి, మలబద్ధకం లేదా విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు వేధిస్తే డాక్టర్‌ని సంప్రదించాలి. అలాగే ఆకలి మందగించడం, ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గిపోవడం, పీరియడ్స్ సమయంలో తీవ్రమైన రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

సమస్యను గుర్తించడం ఎలా?

Advertisement

మీ శరీరంలో వచ్చే ఈ మార్పులను గమనించడానికి చిన్న డైరీ లాంటిది మెయింటైన్ చేయడం చాలా మంచిది. కడుపు ఉబ్బరం ఎప్పుడు మొదలైంది, ఎన్ని రోజులు ఉంది, పీరియడ్స్‌కు ముందు వస్తోందా లేక తర్వాత వస్తోందా అనే వివరాలు రాసి పెట్టుకోండి. ఏయే ఆహారాలు తిన్నప్పుడు గ్యాస్ సమస్య వస్తుందో గమనించండి. డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ వివరాలు చెబితే సమస్య మూలాన్ని త్వరగా గుర్తించడానికి సహాయపడుతుంది.

ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి?

మీ శరీరం సాధారణ పరిస్థితికి భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ను కలవడం మంచిది. పీరియడ్స్‌తో సంబంధం లేకుండా కడుపు ఉబ్బరం దీర్ఘకాలం ఉండి, తీవ్రమైన కడుపునొప్పి, ఆకలి తగ్గడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తే ఆలస్యం చేయకండి. ఏ చిన్న సమస్య వచ్చినా సొంత వైద్యం చేసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడమే ఎప్పుడూ సురక్షితం.

Also Read: జన్యుపరంగా కొలెస్ట్రాల్ ముప్పు ఉన్నా తగ్గించుకోవచ్చా? చెన్నై అధ్యయనం ఏం చెబుతోంది?

Tags

Related News

మీ పిల్లాడు చదువు పట్ల ఆసక్తి చూపడం లేదా? తల్లిదండ్రులకు పేరెంటింగ్ కోచ్ చెప్పిన 3 చిట్కాలు

తక్కువ ధరలో బెస్ట్ వాషింగ్ మెషీన్స్..బ్యాచిలర్స్,కపుల్స్ కోసం బెస్ట్!

అద్దెకు గది వెతుకుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి

తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? ఈ 5 కలలకు అర్థాలు ఇవే

తెల్ల జుట్టు కవర్ చేయడానికి ఇంట్లోనే నేచురల్ హెయిర్ కలర్ తయారీ .. ఇలా చేయండి..

మీ పిల్లలు టపాసుల శబ్దాలకు భయపడుతున్నారా? దీపావళి వేళ తల్లిదండ్రులకు 5 చిట్కాలు

స్వీట్ తినాలనిపిస్తే చాలు..ఈజీగా ఇలా రవ్వ బర్ఫీ చేయండి

Big Stories

Advertisement
×