Shoaib Akhtar On Fast Bowlers: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్…ఈ పేరు వింటేనే ప్రత్యర్థులకు వణుకుపుట్టేది. అప్పట్లో అతడు వేసే బంతులకు బ్యాటర్లు భయపడి పోయేవారు. బౌండరీ గేట్ దగ్గర నుంచి పరిగెత్తుతూ వచ్చి 150కి పైగా స్పీడ్ తో బౌలింగ్ చేసేవాడు. ఇక అతని బౌలింగ్ లో చాలా మంది బ్యాటర్లు గాయపడ్డారు. దాదాపు 20 మందిని తన కెరీర్ లో రిటైర్డ్ హార్డ్ చేశాడు. అలాంటి షోయబ్ అక్తర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ప్రస్తుత ఫాస్ట్ బౌలర్లు ఎవడు కూడా తనలాగా బౌలింగ్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. అప్పట్లో తన బౌలింగ్ దెబ్బకు చాలా బ్యాటర్లకు రక్తాలు కారినట్టు షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటి బౌలర్లు చాలా సున్నితంగా ఫాస్ట్ బౌలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫాస్ట్ బౌలర్లు వేసే ప్రతి బంతి బ్యాటర్ తలకు మాత్రమే తగిలేటట్టు వేయాలని హాట్ కామెంట్స్ చేశారు. అప్పుడే బ్యాటర్ వణికిపోయి వికెట్ ఇచ్చేస్తాడని వెల్లడించారు. కేవలం యార్కర్ల పైన ఆధారపడితే పెద్దగా ప్రయోజనం ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. బంతులు వేస్తే, బ్యాటర్ల ముక్కు, దవడల నుంచి రక్తం రావాలన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పటి బౌలర్లందరూ దద్దమ్మలే.. నా లాగా ఎవడూ వేయడం లేదని షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో అసలు ఫాస్ట్ బౌలర్లకు ఏమైందని నిలదీశారు. బ్యాటర్ల ముఖాలకు బంతులు వేయకుండా చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బౌలర్లు చాలా పద్ధతిగా చిన్న పిల్లవాళ్ళకు వేసినట్టుగానే బంతులు వేస్తున్నట్టు ఆగ్రహించారు. అలాంటి మర్యాద పూర్వక బౌలర్లు క్రికెట్ కు పనికిరారని హేళన చేశారు.
ఫాస్ట్ బౌలర్లు మైదానంలోకి మరింత దూకుడుగా వస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలర్ అంటే ఒక నిప్పు రవ్వలా ఉండాలని షోయబ్ అక్తర్ సూచనలు చేశారు. తమ భయంకరమైన బౌలింగ్ తో బౌలర్ల తలలు పగిలేలా బంతులు సంధించాలని… అలాంటి దూకుడు ఉన్న బౌలర్లు పనికి వస్తారన్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలా ముందుకు వెళ్లాలని సూచనలు చేశారు. టీమిండియాలో పాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ యార్కర్లపైనే ఆధారపడి బతుకుతున్నట్టు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పరువు తీశారు.