E-Paper
Advertisement

స్వీట్ తినాలనిపిస్తే చాలు..ఈజీగా ఇలా రవ్వ బర్ఫీ చేయండి

స్వీట్ తినాలనిపిస్తే చాలు..ఈజీగా ఇలా రవ్వ బర్ఫీ చేయండి
Advertisement

Rava burfi recipe: ఈ రోజుల్లో పండగైనా, పబ్బమైనా లేదా చిన్న చిన్న సంతోషాలైనా స్వీట్ లేకుండా వేడుక పూర్తి కాదు. బయట స్వీట్ షాపుల్లో.. కొనే మిఠాయిలు కల్తీ ఉండే అవకాశం ఉంది. అలాగే.. ఎప్పుడైనా సడన్‌గా నోటికి ఏదైనా తియ్య తియ్యగా తినాలనిపిస్తే బయటకు వెళ్లడం కష్టమవుతుంది. అలాంటి టైమ్‌లో మీ ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ , పంచదార, నెయ్యి ఉంటే చాలు.. క్షణాల్లో సూపర్ టేస్టీ రవ్వ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. పెద్దగా వంట అనుభవం లేని వారు కూడా దీనిని చాలా ఈజీగా చేయెచ్చు. 15 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ రవ్వ బర్ఫీ తయారీ విధానం స్టెప్-బై-స్టెప్ చూసేద్దాం!

కావాల్సిన పదార్థాలు:

బొంబాయి రవ్వ : 1 కప్పు

Advertisement

పంచదార (చక్కెర): 1 కప్పు

పాలు: అర కప్పు (లేదా నీళ్లు)

Advertisement

నెయ్యి: 3 నుంచొ 4 స్పూన్లు

పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు

యాలకుల పొడి: అర స్పూన్

డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం ముక్కలు): కొద్దిగా

తయారీ విధానం:

1. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం ముక్కలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే.. కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి, మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మంచి సువాసన వచ్చే వరకు మంచి రంగు మారకుండా వేయించాలి. రవ్వ వేగితేనే బర్ఫీ గుల్లగా, రుచిగా వస్తుంది.

2. రవ్వ వేగిన తర్వాత అందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. కొబ్బరి వాసన రవ్వతో.. కలిసి మంచి సువాసన వస్తుంది.ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో ఉంచి పక్కన పెట్టుకోవాలి.

3. మరొక చిన్న గిన్నెలో ఒక కప్పు పంచదార, అర కప్పు నీళ్లు (లేదా పాలు) పోసి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి, తీగ పాకం వచ్చే ముందు దశ (అంటే.. జిగురుగా మారే స్టేజ్) రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి.

Also Read: నోరూరించే దోసకాయ టమాటో పచ్చడి..రోట్లో నూరితే అమృతమే!

4. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో ఈ పంచదార పాకాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలుపుకోవాలి. అందులోనే యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి.రవ్వ పాకాన్ని పీల్చుకుని గట్టి పడే వరకు (పాన్ నుంచి విడిపోయే వరకు) కలుపుతూనే ఉండాలి.

5. మిశ్రమం గట్టిపడిన తర్వాత, నెయ్యి రాసిన ఒక ప్లేట్ లేదా ట్రేలోకి ఈ మిశ్రమాన్ని మార్చుకోవాలి. పైన గరిటెతో.. లేదా కప్పు అడుగు భాగంతో సమానంగా సర్దాలి. దానిపై ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను చల్లుకుని తేలికగా నొక్కాలి.

6. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత (సుమారు 10 నిమిషాలు పడుతుంది), మీకు నచ్చిన షేప్‌లో (చదరంగా లేదా డైమండ్ షేప్‌లో) చాకుతో కట్ చేసుకోవాలి. అంతే! నోట్లో వేస్తే.. కరిగిపోయే.. కమ్మనైన రవ్వ బర్ఫీ రెడీ.

ఈజీగా, తక్కువ ఖర్చుతో.. కేవలం 15 నిమిషాల్లో చేసుకునే ఈ రవ్వ బర్ఫీ.. పిల్లలకి ఇష్టమైన హెల్తీ స్వీట్ ఆప్షన్. ఎప్పుడైనా చుట్టాలు వస్తే.. లేదా స్వీట్ తినాలనిపిస్తే ఈ ట్రెండీ రెసిపీని క్షణాల్లో ప్రిపేర్ చేసి అందరితో కలిసి తినండి!

Related News

చింతపండు రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు!

వంకాయ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..రుచి అద్దిరిపోతుంది!

తొలిసారి డేట్‌కు వెళుతున్నారా? సినిమా వెళ్లడం కంటే ఈ 7 పనులు చేయండి

భగవద్గీత.. సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు.. మరి ఇంత అన్యాయం ఎందుకు?

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. కేవలం 30 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది

వాకింగ్ చేసినా సరిపోదు.. ఈ రోజువారీ అలవాట్లతో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బరువు పెరుగుతున్నారా? ఇంట్లోనే ఈ 3 సింపుల్ వ్యాయామాలు చేయండి

Big Stories

Advertisement
×