E-Paper
Advertisement

ఎప్పుడైనా ఆలోచించారా? చాక్లెట్ బార్లపై ఆ గడులు ఎందుకు ఉంటాయో, దీని వెనుక ఇంత కథ ఉందా?

ఎప్పుడైనా ఆలోచించారా? చాక్లెట్ బార్లపై ఆ గడులు ఎందుకు ఉంటాయో, దీని వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

Chocolate Facts: డెయిరీ మిల్క్, లిండ్ట్, లేదా కిట్ క్యాట్.. ఇలా ఏ చాక్లెట్ తీసుకున్నా అందులో చిన్న చిన్న చతురస్రాకారపు గడులు ఉండటం కామన్. మనం ఎప్పుడైనా చాక్లెట్ తింటున్నప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోం. పైపైన విరిచేస్తాం, నోట్లో వేసుకుంటాం, పని చూసుకుంటాం. కానీ, చాక్లెట్‌పై ఉండే ఆ చిన్న గీతలు కేవలం డిజైన్ మాత్రమే కాదండోయ్. వాటి వెనుక చాలా పెద్ద సైన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్, కొద్దిగా సైకాలజీ దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నీట్‌గా విరగడానికి..

చాక్లెట్ చాలా గట్టిగా, పెళుసుగా ఉంటుంది. ఒకవేళ ఆ గీతలు లేకపోతే, దాన్ని ముక్కలు చేయడం మనకి చాలా కష్టమైపోతుంది. చేతికి అడ్డదిడ్డంగా విరిగి, ముక్కలు ముక్కలుగా రాలిపోతుంది. అందుకే చాక్లెట్‌ తయారీదారులు ముందే చిన్న గీతలు పెడతారు. మనం కొంచెం బలం పెట్టి విరగ్గానే.. చాక్లెట్ కరెక్ట్ ఆ గీతల దగ్గరే నీట్‌గా విరిగి వస్తుంది. చాకుతో కట్ చేయాల్సిన పనే ఉండదు.

Advertisement

Also Read: మెదడు చురుగ్గా ఉండాలని ఒమేగా-3 మింగేస్తున్నారా? కొత్త రీసెర్చ్ ఏం చెబుతోందంటే?

పంచుకోవడం సులభం..

చాక్లెట్‌ని ఒంటరిగా తినడం కంటే నలుగురితో పంచుకుంటేనే అసలైన మజా. మనం సినిమా చూస్తున్నప్పుడో, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడో చాక్లెట్‌ని ఈజీగా షేర్ చేసుకోవడానికి ఈ డిజైన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎంత ముక్క విరగాలో ముందే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి.. ఎవరికి ఎంత ఇవాలో ఆలోచించాల్సిన పని లేకుండా అందరికీ సమానంగా పంచవచ్చు.

ఎక్కువ తినకుండా కంట్రోల్..

Advertisement

మనం ఎంత తినాలి అనుకుంటున్నామో.. దానికి మన కళ్లు చూసే విధానమే కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. చాక్లెట్ ఇలా చిన్న చిన్న గడులుగా ఉండటం వల్ల, ఒక్కో ముక్క తింటున్నప్పుడు మన మైండ్‌కి ఒక సిగ్నల్ వెళ్తుంది. ‘సరే.. ఇక్కడితో ఆపేద్దాంట’ అనిపించేలా చేస్తుంది. అదే మొత్తం చాక్లెట్‌ని ఒకేసారి చేతికి ఇస్తే.. తెలియకుండానే అంతా తినేసే అవకాశం ఉంటుంది.

తయారీకి కూడా ఉపయోగకరమే..

ఇక ఫ్యాక్టరీల విషయానికి వస్తే.. లిక్విడ్ చాక్లెట్‌ని ప్రత్యేకమైన మోల్డ్స్‌లో పోస్తారు. ఇలా గడులు ఉండటం వల్ల చాక్లెట్ అన్ని వైపులా ఒకేలా గడ్డకడుతుంది. ఎక్కడా ఎయిర్ బబుల్స్ రాకుండా, సమాన బరువుతో పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అంతేకాకుండా.. తయారైన చాక్లెట్‌ని మోల్డ్ నుండి సులభంగా బయటకు తీయడానికి కూడా ఈ డిజైన్ చాలా ఉపయోగపడుతుంది.

Also Read: పైకి ఆరోగ్యంగా ఉన్నట్లున్నా.. మీ ఎముకలను లోలోపలే తినేస్తున్న చెడు అలవాట్లు ఇవే!

Tags

Related News

పిల్లలకు చిన్నవయసులోనే ఈ 5 విషయాలు నేర్పండి.. ఓటమి భయం ఎప్పుడూ ఉండదు

మీ పార్ట్‌నర్‌కు హారర్ సినిమాలంటే ఇష్టమా? వారిలో ఈ మంచి లక్షణం ఉన్నట్లే

కొలెస్ట్రాల్, బీపీ నార్మల్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ రావచ్చు.. డాక్టర్ సూచించిన ఒక్క బ్లడ్ టెస్ట్ చేయండి

దీపావళి స్పెషల్.. అందరినీ ఆకట్టుకునే 7 బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

చాణక్య నీతి.. సమాజంలో గౌరవం పొందాలంటే ఈ 5 పనులు చేయండి

పేపర్ స్ట్రా లు నిజంగా మంచివేనా.. దక్షిణ కొరియా అధ్యయనంలో తేలిన సంచలనాలివే?

నోరూరించే దోసకాయ టమాటో పచ్చడి..రోట్లో నూరితే అమృతమే!

Big Stories

Advertisement
×