E-Paper
Advertisement

అద్దెకు గది వెతుకుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి

అద్దెకు గది వెతుకుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి
Advertisement

renting a room check Things| ఉద్యోగం, చదువు లేదా ఇతర అవసరాల కోసం సొంత ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందా? అప్పుడు ముందుగా అవసరమయ్యేది హాస్టల్ లేదా అద్దె గది. తక్కువ అద్దెకు మంచి గది దొరికితే చాలని చాలామంది అనుకుంటారు. కానీ గది తీసుకున్న తర్వాత అనుకోని సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. అందుకే గది నచ్చగానే అడ్వాన్స్ ఇచ్చేయకండి. కొన్ని ముఖ్యమైన విషయాలను ముందుగానే పరిశీలిస్తే డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు ప్రశాంతంగా ఉండవచ్చు.

1. గది పరిస్థితిని పూర్తిగా పరిశీలించండి

అద్దెకు గది తీసుకునే ముందు దాని పరిస్థితిని జాగ్రత్తగా చూడండి. గోడలకు తేమ ఉందా, పైకప్పు నుంచి నీరు కారుతోందా, కిటికీలు, తలుపులు సరిగ్గా ఉన్నాయా గమనించండి. విద్యుత్ స్విచ్‌లు, ప్లగ్ పాయింట్లు పనిచేస్తున్నాయో లేదో చూడండి. బాత్రూమ్, కిచెన్ శుభ్రంగా ఉన్నాయా, నీటి కుళాయిలు సరిగ్గా పనిచేస్తున్నాయా పరిశీలించండి. గదిలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే యజమానికి ముందే చెప్పండి. అవసరమైన మరమ్మతులకు ఎవరు ఖర్చు చేస్తారో స్పష్టంగా తెలుసుకోండి.

2. యజమాని పెట్టే రూల్స్ ముందే తెలుసుకోండి

Advertisement

ప్రతి ఇంటి యజమానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇంటికి వచ్చే సమయం, స్నేహితులు లేదా బంధువులను పిలిచే అనుమతి గురించి అడగండి. గదిలో వంట చేసుకోవచ్చా, ఉమ్మడి కిచెన్ ఉపయోగించవచ్చా తెలుసుకోండి. మీరు ఉద్యోగం చేస్తూ రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే, దానికి అనుమతి ఉందో లేదో ముందే నిర్ధారించుకోండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనవసరమైన గొడవలు తగ్గుతాయి.

3. నీరు, కరెంట్, ఇంటర్నెట్ సౌకర్యాలు చెక్ చేయండి

గదిలో రోజూ నీరు అందుతుందా తెలుసుకోండి. కరెంట్ సరఫరా ఎలా ఉంటుంది, విద్యుత్ కోతలు వచ్చినప్పుడు ఇన్వర్టర్ లేదా బ్యాకప్ సౌకర్యం ఉందా అడగండి. కరెంట్ బిల్లు అద్దెలో కలిపి తీసుకుంటారా, విడిగా చెల్లించాలా స్పష్టత తెచ్చుకోండి.మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యాలను కూడా పరిశీలించండి. ఆన్‌లైన్ తరగతులు లేదా ఇంటి నుంచే పని చేసేవారికి మంచి ఇంటర్నెట్ చాలా అవసరం.

4. మొత్తం ఖర్చు లెక్కించండి

Advertisement

అద్దె తక్కువగా ఉందని వెంటనే నిర్ణయం తీసుకోకండి. అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్, మెయింటెనెన్స్ ఛార్జీలు ఎంత ఉంటాయో తెలుసుకోండి. నీరు, కరెంట్, వైఫై వంటి వాటికి అదనంగా చెల్లించాలా అడగండి. డిపాజిట్ తిరిగి ఇచ్చే నిబంధనలు, గది ఖాళీ చేసే ముందు ఎంత సమయం ముందుగా చెప్పాలో తెలుసుకోండి. అద్దె, ఇతర ఖర్చుల వివరాలను రాతపూర్వకంగా తీసుకోవడం మంచిది.

Also Read: చాణక్య నీతి.. ఈ 7 చెడు అలవాట్లు ఉంటే జీవితంలో విజయం ఎప్పటికీ సాధించలేరు

5. భద్రత, పరిసరాలు పరిశీలించండి

మీ ఆఫీస్ లేదా కాలేజీకి గది దగ్గరగా ఉందో చూడండి. సమీపంలో కిరాణా దుకాణాలు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, రవాణా సౌకర్యాలు ఉన్నాయా తెలుసుకోండి. ముఖ్యంగా ఒంటరిగా ఉండేవారు రాత్రి సమయంలో ఆ ప్రాంతం ఎంత సురక్షితంగా ఉంటుందో పరిశీలించాలి. తలుపుల తాళాలు, కిటికీల లాక్‌లు సరిగ్గా ఉన్నాయో చూడండి.

6. అడ్వాన్స్ ఇచ్చే ముందు అగ్రిమెంట్ సరిగా చదవండి

గదిని స్వయంగా చూసిన తర్వాతే డబ్బు చెల్లించండి. వీలైతే అక్కడ ఉంటున్నవారితో మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకోండి. అద్దె ఒప్పందంలోని నిబంధనలను పూర్తిగా చదివి, అర్థమైన తర్వాతే సంతకం చేయండి.

Also Read: ఉద్యోగం పోయింది, ఆర్థిక సంక్షోభం వస్తే ఎలా? ఎమర్జెన్సీ ఖర్చులకు అప్పు చేయకుండా ఈ 3 పనులు చేయండి

గుర్తుంచుకోండి

గది ఎంపికలో అద్దె ఒక్కటే ముఖ్యం కాదు. సౌకర్యాలు, భద్రత, అదనపు ఖర్చులు కూడా పరిశీలిస్తే సరైన గదిని ఎంచుకోవచ్చు.

Tags

Related News

మీ పిల్లాడు చదువు పట్ల ఆసక్తి చూపడం లేదా? తల్లిదండ్రులకు పేరెంటింగ్ కోచ్ చెప్పిన 3 చిట్కాలు

తక్కువ ధరలో బెస్ట్ వాషింగ్ మెషీన్స్..బ్యాచిలర్స్,కపుల్స్ కోసం బెస్ట్!

నెలసరి ముందు వచ్చే కడుపు ఉబ్బరం.. ఏయే సమస్యలకు సంకేతం కావొచ్చు?

తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? ఈ 5 కలలకు అర్థాలు ఇవే

తెల్ల జుట్టు కవర్ చేయడానికి ఇంట్లోనే నేచురల్ హెయిర్ కలర్ తయారీ .. ఇలా చేయండి..

మీ పిల్లలు టపాసుల శబ్దాలకు భయపడుతున్నారా? దీపావళి వేళ తల్లిదండ్రులకు 5 చిట్కాలు

స్వీట్ తినాలనిపిస్తే చాలు..ఈజీగా ఇలా రవ్వ బర్ఫీ చేయండి

Big Stories

Advertisement
×