E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా?Haier vs Samsung ఫ్రిజ్ ధరలు,ఆఫర్లు!

తక్కువ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా?Haier vs Samsung ఫ్రిజ్ ధరలు,ఆఫర్లు!
Advertisement

Haier vs Samsung refrigerator: ఇంట్లో ఫ్రిజ్ పాడైపోయిందా.. లేదా కొత్త టెక్నాలజీతో.. కూడిన లేటెస్ట్ మోడల్‌కు మారాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన టైం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో జరుగుతున్న.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026’ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా.. హోమ్ అప్లయన్సెస్ కేటగిరీలో.. ఫ్రిడ్జ్‌లపై కంపెనీలు ఊహించని రీతిలో.. ధరలను తగ్గించాయి. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న.. Haier, Samsung బ్రాండ్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండగా, కస్టమర్లు కళ్లు చెదిరే ఆఫర్లు దక్కుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Haier vs Samsung: ఏది బెటర్?

ఫ్రిజ్ కొనాలనుకునే ప్రతి ఒక్కరిలోనూ Haier, Samsung మధ్యే ప్రధానమైన చర్చ నడుస్తోంది.

Advertisement

హైయర్: తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు, ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, అద్భుతమైన కూలింగ్ కెపాసిటీ కోరుకునే వారికి హైయర్ ఫ్రిడ్జ్‌లు పర్ఫెక్ట్ ఛాయిస్. ముఖ్యంగా.. దీని బాటమ్ మౌంటెడ్ ఫ్రిడ్జ్‌లు సరుకులు తీసుకోవడానికి కిందికి వాగాల్సిన పనిలేకుండా సౌకర్యంగా ఉంటాయి.

శాంసంగ్ : డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, ప్రీమియం లుక్, స్పేస్ సేవింగ్ డిజైన్ ,స్మార్ట్ కనెక్టివిటీకి శాంసంగ్ కేరాఫ్ అడ్రస్. డిజిటల్ డిస్‌ప్లే, వైఫై ఫీచర్లు, ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలనుకునే వారు శాంసంగ్‌ను ఎంచుకుంటారు.

అమెజాన్ సేల్‌లో టాప్ 5 బ్రాండ్స్ డిస్కౌంట్లు :

Advertisement

ఈ ఫెస్టివల్ సేల్‌లో కేవలం Haier, Samsung మాత్రమే కాకుండా LG, Whirlpool, Godrej బ్రాండ్లు కూడా భారీ ధరల తగ్గింపును ప్రకటించాయి. వివిధ మోడళ్ల ధరలు, ఆఫర్ల వివరాలు..

1.Haier 190L 4-Star Refrigerator:

చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. మెరైన్ ఐవీ డిజైన్, బాటమ్ స్టాండ్ డ్రయర్‌తో వచ్చే ఈ మోడల్ ధర అమెజాన్ సేల్‌లో రూ. 17,000 నుంచి రూ.19,000 లోపు శ్రేణిలో లభిస్తోంది.ఇది కరెంట్ బిల్లును బాగా ఆదా చేస్తుంది.

2.Samsung 256L 3-Star Refrigerator:

మధ్యమ తరహా కుటుంబాల కోసం శాంసంగ్ అందించిన ఈ కన్వర్టిబుల్ ఫ్రిజ్ ధర రూ. 32,000 నుంచి రూ.36,000 మధ్య ఉంది. ఫ్రీజర్‌ను అవసరానికి తగినట్లు సాధారణ ఫ్రిజ్‌లా మార్చుకునే.. వీలుండటం దీని ప్రత్యేకత. సేల్‌లో దీనిపై అదనపు బ్యాంకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

3.Samsung 653L 3-Star Refrigerator:

పెద్ద కుటుంబాల కోసం తయారు చేసిన ఈ భారీ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ అసలు ధర దాదాపు రూ. 1,13,000 ఉండగా, అమెజాన్ సేల్ ప్రత్యేక ఆఫర్ కింద ఇది సుమారు రూ. 67,990 కే లభిస్తోంది. దీనిపై రూ. 45,000 వరకు భారీ తగ్గింపు లభిస్తోంది.

4.Haier 596L 3-Star Refrigerator:

ప్రీమియం లుక్, స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారి కోసం హైయర్ సైడ్-బై-సైడ్ మోడల్ రూ.59,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని అసలు మార్కెట్ ధర రూ. 1,00,000 పైమాటే ఉండగా..సేల్ తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది.

5.Whirlpool & LG Fridges:

విర్లుపూల్ ప్రోట్టన్ ,ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్‌లు రూ. 25,000 నుంచి రూ.40,000 ధరల శ్రేణిలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మైక్రోబ్లాక్ టెక్నాలజీతో కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.

Also Read: కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

అదనపు ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం ప్రైస్ కట్ మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.అంతేకాకుండా, పాత ఫ్రిజ్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందొచ్చు. బడ్జెట్ తక్కువగా ఉన్నవారు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఉపయోగించుకుని ఈఎంఐ ఆప్షన్‌పై వీటిని ఇంటికి తెచ్చుకోవచ్చు.

మీరు కొత్త ఫ్రిజ్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ అమెజాన్ సేల్ మంచి అవకాశాన్ని అందిస్తోంది. మీ బడ్జెట్ , కుటుంబ సభ్యుల అవసరాలకు తగినట్లుగా Haier లేదా Samsung మోడల్స్‌ను ఎంచుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఆఫర్లు తక్కువ కాలం మాత్రమే కాబట్టి వెంటనే మీ ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేసుకోండి!

Related News

శాంసంగ్,ఇతర బ్రాండ్లు మళ్లీ 4G ఫోన్‌లను మార్కెట్‌లోకి ఎందుకు తెస్తున్నాయి?

స్మార్ట్‌వాచ్‌లు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయా? లేక టెన్షన్ పెంచుతున్నాయా?

రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!

చలికాలం స్పెషల్.. మార్కెట్లోకి ఇంటెక్స్ సరికొత్త ‘గీజర్లు’.. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు!

కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా?ఈ 6 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

పది మందిలో ఏడుగురికి తెలియని..వై-ఫై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ఇవే

Big Stories

Advertisement
×