BigTV English

Rainy Season Tips: వర్షాకాలం జ్వరాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Rainy Season Tips: వర్షాకాలం జ్వరాలు..  తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Rainy Season Tips: వర్షాకాలం మొదలైంది. గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా పడుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా వరద నీరు నిలిచిపోతుంది. నిలిచిపోతున్న వరద నీరు కారణంగా దోమలు, ఈగల బెడద కూడా క్రమ క్రమంగా ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా వర్షాకాంలో సంభవించే జ్వరాల పట్ల చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దోమలు, ఈగల కారణంగా వైరల్ ఫీవర్ లు వ్యాప్తి చెందుతాయి. ఇలా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వర్షంలో తడవడం వల్ల తలనొప్పి, జ్వరం, అసలట, నీరసం, ముక్కు కారడం అంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


తొలుత ఇలాంటి సమస్యలు తలెత్తి నెమ్మదిగా అది జ్వరం వరకు దారితీస్తుంది. ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం వంటివి కూడా ప్రారంభమవుతాయి. అయితే ఇలాంటి వ్యాధులు సంభవించకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వర్షంలో తడవకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ వర్షంలో తడిసినా కూడా ఇంటికి వెళ్లిన వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలి. వెంటనే వేడి నీళ్లతో స్నానం చేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల జలుబు, జ్వరం వంటివి త్వరగా వ్యాపించకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నవారు అయితే ఇలాంటి చర్యలు తప్పక పాటించాలి.

వర్షాకాలంలో ఎక్కువగా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్‌లు సంభవిస్తుంటాయి. ఇవి దోమలు, ఈగల వల్ల సంభవించినా కూడా త్వరగా ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందువల్ల ఫీవర్ వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి. అంతేకాదు త్వరగా జ్వరం తగ్గడానికి మంచి సమతుల ఆహారాన్ని తినాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల వైరల్ ఫీవర్ ల నుంచి కొంత వరకు జాగ్రత్తగా ఉండవచ్చు. మరోవైపు ఇంటి చుట్టుపక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వర్షం నీరు నిలిచిపోయిన చోట దోమల బెడద పెరిగి ఇలాంటి జ్వరాలు సంభవిస్తాయి. అందుకే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.


Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×