BigTV English

Pakistan Senator: భారత్ పాకిస్థాన్‌కు తేడా అదే.. దాయాది ప్రభుత్వాన్ని ఏకి పారేసిన సెనేటర్..

Pakistan Senator: భారత్ పాకిస్థాన్‌కు తేడా అదే.. దాయాది ప్రభుత్వాన్ని ఏకి పారేసిన సెనేటర్..

Pakistan Senator Praised India: పాకిస్తాన్ సెనేట్ ప్రతిపక్ష నాయకుడు షిబ్లీ ఫరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, భారతదేశ ఎన్నికల వ్వవస్థపై తేడాలనే నొక్కి చెప్పారు. ఇటీవలి ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని.. కానీ పాక్ ఎన్నికల్లో మాత్రం రిగ్గింగ్ జరుగుతోందని విరుచుకుపడ్డారు.


భారతదేశం సమర్థవంతంగా ఎన్నికలను నిర్వహిస్తోందని ప్రశంసించారు. పాక్‌లో శాంతియుతంగా అధికార మార్పిడిని నిర్ధారించడానికి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించలేకపోతున్నారని సొంత దేశాన్ని ఏకిపారేశారు.

భారతదేశంలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయన్నారు ఫరాజ్. దాదాపు 800 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఉన్నాయ్నారు. భారత పోలింగ్ వ్వవస్థ ఎంత అభివృద్ధి చెందిందంటే మారుమూల ప్రాంతంలో నివసించే వ్యక్తి కోసం కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారన్నారు. అయినా ఎక్కడ కూడా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒక్క స్వరం కూడా వినిపించలేదని ఇస్లామాబాద్‌లో జరిగిన పార్లమెంటు సమావేశంలో షిబ్లీ ఫరాజ్ అన్నారు.


పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ సభ్యుడైన ఫరాజ్, గతంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో బహుళ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.

Also Read: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..

ఓడిపోయిన అభ్యర్థులు ఓటమిని అంగీకరించడానికి నిరాకరించిన పాకిస్తాన్ ఎన్నికలలో అనేక వివాదాలు జరిగాయని ఫరాజ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌లోని ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికలను ఎందుకు నిర్వహించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. ముస్లిం లీగ్, ఎమ్‌క్యూఎంతో సహా అన్ని పార్టీల స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమని ఆయన తేల్చిచెప్పారు.

పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి 1,300 ఫిర్యాదులు అందాయి. కౌంటింగ్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా పలు స్థానాల ఫలితాలను ఇప్పటివరకు పోల్ అధికారులు ప్రకటించలేదు.

ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి పరిశీలకులు కూడా పాకిస్తాన్‌లో ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు జరిగిన రిగ్గింగ్‌ను ఎత్తి చూపారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×