BigTV English

Pawan Kalyan: పూల బొకేలు.. శాలువాలు తీసకురావద్దు.. కార్యకర్తలకు జనసేనాని విజ్ఞప్తి..

Pawan Kalyan: పూల బొకేలు.. శాలువాలు తీసకురావద్దు.. కార్యకర్తలకు జనసేనాని విజ్ఞప్తి..

Janasena Chief Pawan Kalyan Request: తనని కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని జనసేనాని, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనని నేరుగా కలిసి అభినందనలు తెలపాలని జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆశిస్తున్నారన్నారు పవన్ కల్యాణ్. అయితే త్వరలో వారందరనీ కలుస్తానని అన్నారాయన.


జిల్లాల వారిగా అందరినీ కలుస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయ నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలోని వారు, యువత, రైతులు, మహిళలు, ఉద్యోగులు అభినందనలు తెలుపుతున్నారన్నారు పవన్ కల్యాణ్.

ఇక జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రత్యేకంగా చెప్పారు పవన్ కల్యాణ్. పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఆనందంతో వేడుకలు చేసుకుంటున్నారన్నారు.


Also Read: మహా అయితే నాలుగు కేసులు పెడుతారు.. అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేరు: జగన్

ఇక ఈ నెల 20వ తేదీ తర్వాత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తానన్నారు. ఆ తరువాత వివిధ దశల్లో గ్రామల్లో పర్యటిస్తాని చెప్పారాయన. ఇప్పటివరకు తనకు అభినందనలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలిచిన జనసేనాని సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా 21 సీట్లో పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన ఏకైక పార్టీగా జనసేన రికార్డు సృష్టించింది.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×