Pumpkin Seeds: గుమ్మడి గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
తమను తాము ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీటిని తమ ఆహారంలో భాగంగా చేసుకునే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. గుమ్మడి గింజలు తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఎముకలు కూడా బలంగా మారతాయి. గుమ్మడికాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉన్న సూపర్ ఫుడ్. మీరు వీటిని మీ రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలి. గుమ్మడి గింజలను పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వీటి ప్రయోజనాలను పొందవచ్చు.
జీర్ణక్రియను మెరుగుదల:
గుమ్మడి గింజలు ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం. దీని కారణంగా అవి గట్ మైక్రోబయోమ్‌ను రక్షిస్తాయి. అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. అంతే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు గుమ్మడి గింజలను తినడం ద్వారా అద్భుత ఫలితాలు పొందవచ్చు.
రోగనిరోధక శక్తి:
గుమ్మడికాయ గింజల్లో పాలీఫెనాల్స్, ప్రీ-బయోటిక్స్‌తో పాటు కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా బలహీన మైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు గుమ్మడి గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్:
గుమ్మడికాయ గింజలు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడటమే కాకుండా, గుమ్మడికాయ గింజలు తినేవారిలో UTI లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించడంలో కూడా గుమ్మడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యం:
గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా వాటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది:
ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలు నిద్ర నాణ్యత, వ్యవధి రెండింటినీ మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ట్రిప్టోఫాన్ అనేది ఒక అమైనో ఆమ్లం. ఇది సెరోటోనిన్ , మెలటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
Also Read: అవిసె గింజలతో.. అద్భుత ప్రయోజనాలు !
మధుమేహం:
మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు గుమ్మడి గింజలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి. అంతే కాకుండా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం కోసం తరచుగా గుమ్మడి గింజలను తినడం అలవాటు చేసుకోవాలి.
మానసిక స్థితి:
నిరాశతో ఉన్న వారు గుమ్మడి గింజలను తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా నిరాశను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.