Flax Seeds: అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. వీటిలో ఉండే ఔషధ గుణాలు అనేక వ్యాధులను నివారించడంలో సహాయ పడతాయి. అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
ప్రతిరోజూ అవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
అవిసె గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:
అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు , ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఇది రక్తపోటును నియంత్రించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయి పెరుగుతుంది. ఫలితంగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అవిసె గింజలు అధిక మొత్తంలో కరిగే , కరగని ఫైబర్‌లను కలిగి ఉంటాయి. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సరైన మొత్తంలో ఫైబర్ శరీరంలో మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
అవిసె గింజలలోని ఫైబర్, ప్రోటీన్ కలయిక కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఫలితంగా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో పాటు, అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని కొవ్వును తగ్గించే ప్రక్రియను ప్రోత్సహిస్తాయి. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక గొప్ప డైట్ ఆప్షన్.
చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది:
అవిసె గింజలలో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని కూడా హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అంతే కాకుండా ముడతలు, ఇతర చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా, ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . జుట్టును బలంగా , మెరిసేలా చేయడంలో ఉపయోగపడుతుంది.
హార్మోన్ల సమతుల్యత:
అవిసె గింజల్లో లిగ్నన్స్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పీరియడ్స్ సమయంలో హార్మోన్ల అసమ తుల్యతను సరిచేయడంలో సహాయపడుతుంది.
Also Read: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు !
మధుమేహం:
అవిసె గింజలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
ఇందులో కరిగే ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి శరీరం యొక్క ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరమైన ఆహారంగా మారుతుంది. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులను నివారిస్తుంది.